Covid Portal: పొరబాటున పోర్న్ లింక్ పోస్ట్ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
కెనడా ఆరోగ్య శాఖ పెద్ద పొరబాటే చేసింది. క్షణాల్లో తేరుకున్నప్పటికీ అప్పటికే నెటిజన్లు గమనించడంతో ట్రోలింగ్ తప్పలేదు. కెనడాలోని కొవిడ్ పోర్టల్‌లో పోస్టు చేయాల్సిన లింక్ కు బదులుగా..

Covid Portal: కెనడా ఆరోగ్య శాఖ పెద్ద పొరబాటే చేసింది. క్షణాల్లో తేరుకున్నప్పటికీ అప్పటికే నెటిజన్లు గమనించడంతో ట్రోలింగ్ తప్పలేదు. కెనడాలోని కొవిడ్ పోర్టల్‌లో పోస్టు చేయాల్సిన లింక్ కు బదులుగా పోర్న్ హబ్ కు చెందిన లింక్ ఒకటి పోస్టు చేసింది ఆరోగ్య శాఖ. వెంటనే జరిగిన పొరబాటు గమనించి పోస్టును డిలీట్ చేసింది కూడా.
“పరిస్థితి పరిధి దాటడంతో అలా జరిగింది. తప్పుడు లింక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసేశాం” అంటూ ఏఎఫ్పీకి ఈమెయిల్ లో విన్నవించుకుంది ఆరోగ్య శాఖ. లక్ష మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న హెల్త్ మినిష్ట్రీపై ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు అధికారులు.
ఇదంతా క్షణాల వ్యవధిలోనే గమనించారు ఇంటర్నెట్ యూజర్లు. పూర్తిగా ఏకిపారేస్తూ.. కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ప్రపంచంలోని మోస్ట్ ట్రాఫికింగ్ వెబ్ సైట్లలో ఒకటైన ఆ పోర్న్ సైట్ ను మైండ్ గీక్ వారు నిర్వహిస్తున్నారు.
Read Also: కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో సెలైన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ దొరికిపోయిన డాక్టర్