Indian diaspora : వలసలపై ట్రంప్ ఉక్కుపాదం.. ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన.. మేజర్లయ్యాక పిల్లలు అమెరికా వీడాల్సిందేనా?!
Indian diaspora : అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి ఎండ్ కార్డు పడింది. భారతీయుల పిల్లలు మేజర్లయ్యాక అమెరికా వీడాల్సి వస్తుందని ఆందోళన..

Indian diaspora with ageing children
Indian diaspora : అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోతున్న తరుణంలో ఇమ్మిగ్రేషన్‌పై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వైఖరిని వ్యహరిస్తున్నారు. ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో జన్మించిన పిల్లలకు పుట్టుకతో పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఫలితంగా తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా అమెరికా పౌరులు కారు.. డాక్యుమెంట్ చేసిన (చట్టపరమైన) డ్రీమర్‌ల తల్లిదండ్రులను కోల్పోవడానికి దారితీస్తుంది. తద్వారా మేజర్లుగా మారిన పిల్లలు తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. వలస చట్టాలపై ట్రంప్ అవలంభించే వరుస నిర్ణయాలతో ప్రవాస భారతీయుల్లో టెన్షన్ నెలకొంది. తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కకని పక్షంలో భారత్‌కు తిరిగి వెళ్లాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also : Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం.. భారత్‌కు ఇబ్బందులు తప్పవా?
ఫిబ్రవరి 19 నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి :
అగ్రరాజ్యంలో పుట్టుకతో పౌరసత్వానికి ముగింపు పలికేలా ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి విధితమే. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఆదేశాలు అమెరికాలో అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. విదేశీయుల సంతానం అమెరికాలో జన్మించినప్పటకీ వారికి పౌరసత్వం లభించదు. గ్రీన్ కార్డు లేదా పౌరసత్వం ఉన్న విదేశీయుల సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించనుంది. హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై ఆధారపడిన ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
21 ఏళ్లు నిండిన తర్వాత పిల్లలకు పౌరసత్వం వర్తించదు :
డాక్యుమెంట్ చేసిన డ్రీమర్‌లు అంటే.. భారత్‌లో జన్మించిన పిల్లలు.. కానీ వీరిని తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు తీసుకువచ్చారు. H-1B వీసాల వంటి నాన్-ఇమిగ్రెంట్ వీసా హోల్డర్ల పిల్లలు. 21 ఏళ్లు నిండిన తర్వాత ఈ పిల్లలు తమ డిపెండెంట్ వీసా స్టేటస్ (H-4)ని కోల్పోతారు. అప్పుడు వేరే దేశానికి స్వీయ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదంటే.. వారి వీసా స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

Indian diaspora with ageing children
ఈ హెచ్-1బీ వీసాలపై చాలామంది భారతీయులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే పిల్లల్ని కూడా కన్నవారు అనేకం. మరికొందరు పిల్లలు పుట్టగానే వారిని తీసుకుని అమెరికా వెళ్లినవారు ఉన్నారు. ఇన్నాళ్లూ తల్లిదండ్రుల డిఫెండెంట్ వీసా (H-4) పైనే ఈ పిల్లలు అమెరికాలో ఉంటన్నారు. రాబోయే రోజుల్లో ఈ చిన్నారులంతా మేజర్లు కాబోతున్నారు. 21 ఏళ్లు నిండిన తర్వాత వీరంతా వీసా స్టేటస్ కోల్పోవాల్సి వస్తుంది. వీరిని అమెరికాలో డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు. ఒకవేళ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లు అయితే మాత్రం వారంతా హెచ్-4 వీసా కోల్పోవాల్సి వస్తుంది. మేజర్లుగా మారేలోపు వారికి అమెరికా పౌరతస్వం, గ్రీన్ కార్డు లేదా తాత్కాలిక వీసా మంజూరు కావాలి. లేదంటే.. ఈ పిల్లలంతా మేజర్లు అయ్యాక అమెరికాను వీడి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది.
కార్యరూపం దాల్చని చిల్డ్రన్ బిల్లులు :
డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాలో గత బైడెన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో ద్వి-పక్షపాత బిల్లు, అమెరికాస్ చిల్డ్రన్ బిల్లుతో సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ, ఇందులో ఏ బిల్లు కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు.. అమెరికాస్ చిల్డ్రన్స్ బిల్లు డాక్యుమెంట్ చేసిన డ్రీమర్‌లకు శాశ్వత నివాసానికి మార్గాన్ని అందించింది. వీరంతా అమెరికాలో పదేళ్లపాటు చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థ నుంచి పట్టభద్రులు కూడా అయ్యారు.
డేవిడ్ జె బీర్ గత విశ్లేషణ ప్రకారం.. మార్చి 2023 నాటికి, భారత్ నుంచి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ (EB-2, EB-3 స్కిల్డ్ కేటగిరీ) 10.7 లక్షలకు చేరుకుంది. దాదాపు 1.34 లక్షల మంది పిల్లలు గ్రీన్ కార్డ్ పొందకముందే వయస్సు దాటిపోతారని అంచనా. ప్రతి దేశంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్యకు అనులోమానుపాతంలో గ్రీన్ కార్డ్‌లు జారీ అయ్యాయి. పుట్టిన దేశానికి 7శాతం చొప్పున ఏకపక్షంగా పరిమితం చేశారు. వీరిలో బ్యాక్‌లాగ్‌లో భారతీయులే ఆధిపత్యం చెలాయించారు. ఈ ప్రమాణం తరచుగా తల్లిదండ్రుల నుంచి విడిపోవడానికి దారితీస్తుంది.
Read Also : జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసిన ట్రంప్.. ఇక అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఏంటి?