swastika symbol : స్వస్తిక్ గుర్తుతో సౌదీలో తెలుగు ఫ్యామిలీకి చిక్కులు
సౌదీ అరేబియాలో ఓ తెలుగువాడు చిక్కుల్లో పడ్డాడు. అదీ స్వస్తిక్ గుర్తు ఇంటికి గుమ్మానికి పెట్టుకోవడం వల్ల జైలు పాలయ్యాడు.. దాంతో ఏం సమస్య అంటారా? స్వస్తిక్‌ను చూసి జర్మనీలోని నాజీల గుర్తుగా ఓ అరబ్బు పొరబడటంతో ఈ సమస్య వచ్చింది.

swastika symbol
swastika symbol -Telugu family : భారత దేశంలో ఎక్కువగా శుభకార్యాలు జరిగే సందర్భంలో స్వస్తిక్ గుర్తు వాడతారు. శుభ సూచకంగా ఈ గుర్తుని వాడటం జరుగుతుంది. అయితే ఈ గుర్తు వాడటం వల్ల సౌదీ అరేబియాలో ఓ తెలుగు ఫ్యామిలీ చిక్కుల్లో పడింది.
గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి రీసెంట్‌గా సౌదీ అరేబియాకి వెళ్లాడు. అక్కడ పేరున్న కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా జాబ్‌లో చేరాడు. అల్ ఖోబర్ నగరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో నివాసం ఉంటున్న అతను తన ఇంటికి తలుపుకు స్వస్తిక్ గుర్తును వేశారు. అదే అతనికి కష్టాలు తెచ్చింది. అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ఓ అరబ్బు ఆ స్వస్తిక్‌ను చూసి జర్మనీలోని నాజీల గుర్తుగా దానిని పొరపడ్డాడు. వెంటనే దానిని తొలగించాలని తెలుగు ఇంజినీర్‌ను కోరాడు. ఇక మన తెలుగు కుటుంబం స్వస్తిక్ గుర్తు గురించి ఎంత చెప్పినా అరబ్బు చెవికెక్కలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక ద్వారానికి స్వస్తిక్ గుర్తు పెట్టిన ఇంజినీర్‌ని సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. తన భర్తను ఈ సమస్య నుంచి కాపాడాల్సిందిగా ఇంజినీర్ భార్య కోరడంతో అక్కడికి దగ్గరలో ఉండే తెలుగు సామాజిక కార్యకర్త ముజమ్మీల్ శేఖ్ ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. త్వరలో ఆ ఇంజినీర్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.