ఏపీ యువకునికి అమెరికాలో 10ఏళ్ల జైలు శిక్ష

  • Published By: vamsi ,Published On : April 21, 2019 / 04:22 AM IST
ఏపీ యువకునికి అమెరికాలో 10ఏళ్ల జైలు శిక్ష

Updated On : April 21, 2019 / 4:22 AM IST

అమెరికాలో ఏపీకి యువకునికి పదేళ్ల జైలు శిక్ష పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) 2015లో స్టూడెంట్ వీసాతో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలోని సెయింట్‌ రోజ్‌ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ‘యూఎస్‌బీ కిల్లర్’ బగ్‌తో 66 కంప్యూటర్లను పనికిరాకుండా చేసిన విశ్వనాథ్ కొన్ని కంప్యూటర్లను ఫిజికల్‌గా పగలగొట్టాడు.

దీంతో కాలేజీకి రూ.40 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఆ కంప్యూటర్లను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు కాలేజీకి రూ.5,10,900 ఖర్చు అవగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చేసిన నేరాన్ని ఒప్పుకున్న విశ్వనాధ్ తోట.. కాలేజ్‌కు జరిగిన డ్యామేజ్ చెల్లిస్తానని చెప్పాడు.

ఈ కేసును విచారించిన కోర్టు విశ్వనాథ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష, 17,349,100 జరిమానా విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక మూడేళ్లపాటు పర్యవేక్షణలో ఉండాలంటూ వెల్లడించింది. ఆగస్టులో ఈ శిక్ష ఖారారు అవనుంది.