Guinness Record: జ‌డ‌తో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించిన భారత్ మహిళ

జ‌డ‌తో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించింది భారత్ మహిళ ఆశారాణి. ఐరన్ క్వీన్ అనే బిరుదు సాధించింది.

Guinness Record: జ‌డ‌తో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించిన భారత్ మహిళ

Guinness Record

Updated On : January 6, 2022 / 3:44 PM IST

Iron Queen Asha RaniGuinness World Record : భార‌త్‌కు చెందిన‌ ఆశారాణి అనే మ‌హిళ త‌న జ‌డ‌తో డ‌బుల్ డెక్ బ‌స్సును లాగి గిన్నిస్ రికార్డు సాధించింది. ఆ డబుల్ డెక్కర్ బస్సు బరువు 12,126 కిలోలు. అంత బరువున్న బస్సుని అవలీలగా తన జ‌డ‌తో లాగేసి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేసింది ఆశారాణి. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. రాణి గిన్నిస్‌ రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు.

Vistara sale Offer: రూ. 977కే విమాన ప్రయాణం.. 48 గంటల్లోనే!

2016లోనే ఆశా రాణి ఇట‌లీలో ఈ ఫీట్‌ను సాధించింది. త‌న‌కు ఐర‌న్ క్వీన్ అనే బిరుదును కూడా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్ర‌తినిధులు ఇచ్చారు. తాజాగా అప్ప‌టి వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయ‌డంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.ఆశారాణి 2013లో UKలోని లీసెస్టర్‌షైర్‌లో రాణి తన రెండు చెవులతో 1,700 కిలోల వ్యాన్‌ను లాగి రికార్డును బద్దలు కొట్టింది.

Italy-Amritsar Flight : ఇటలీ నుంచి వచ్చిన విమానంలో 125మందికి కరోనా