ఇవాంకా మద్దతు : వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి ఇంద్రనూయి

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 07:21 AM IST
ఇవాంకా మద్దతు :  వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి ఇంద్రనూయి

Updated On : January 16, 2019 / 7:21 AM IST

వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో ఇంద్రనూయి
ఇంద్రనూయిని స్వయంగా నామినేట్ చేసిన ఇవాంకా ట్రంప్
‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడి
వరల్డ్ అధ్యక్ష రేసులో వున్న ఇవాంకా అంటు వార్తలు
ఫిబ్రవరి 1న పదవి నుండి తప్పుకోనున్న జిమ్‌ యాంగ్‌ కిమ్‌ 

ఢిల్లీ : పెప్సీ కంపెనీ మాజీ సీఈవో ఇంద్రనూయిని మరో ప్రతిష్టాత్మక పదవి వరించనుంది. ఇంద్రనూయిని వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్  నామినేట్‌ చేసినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చిన క్రమంలో స్వయంగా ఇవాంకా ట్రంప్ ఇంద్రనూయిని స్వయంగా నామినేట్ చేస్తున్నట్లుగా వైట్ హౌస్ వర్గాల సమాచారం. దీంతో ఇంద్రనూయి ఆ పదవిని చేపట్టే అవకాశాలు పుష్కలమని తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ ఫిబ్రవరి 1న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

దీంతో అధ్యక్ష ఎన్నిక అనివార్తం కాగా, 12 ఏళ్లు పెప్సీ కో సీఈఓగా పనిచేసిన ఇంద్రనూయి పేరు తెరపైకి వచ్చింది. వరల్డ్ బ్యాంక్‌ లో అతిపెద్ద భాగస్వామిగా అమెరికా ఉన్నందున, ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశాలు పుష్కలం. ఇక ఇవాంక నామినేషన్ ను పలు సభ్య దేశాలు ఆమోదించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత శక్తిమంతురాలైన మహిళల జాబితాలో ఇంద్రనూయి పేరు పలుమార్లు చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షురాలికి ఇవాంకా ట్రంప్ దాదాపు  ఖాయం అయిన క్రమంలో సడెన్ గా ఇంద్రనూయిని ఇవాంకా ట్రంప్ నామినేట్ చేసారని ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించటం సంచలనంగా మారింది.