Iran vs Israel War : చర్చలు జరగలేదు.. అదంతా కుట్రకోణంలో భాగమే.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందన..
Iran vs Israel War : వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికాను నమ్మలేమని, ట్రంప్ ప్రకటన వెనుక కుట్రకోణం దాగిఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు.
Iran vs Israel War
- ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్
- అమెరికాను నమ్మలేమని ప్రకటన
- ట్రంప్ ప్రకటనలో కుట్రకోణం ఉందని వెల్లడి
Iran vs Israel War : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా వార్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదురోజుల వరకు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నాం.. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామని ట్రంప్ చెప్పారు. అయితే, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మీడియా స్పందించింది.
వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికాను నమ్మలేమని, ట్రంప్ ప్రకటన వెనుక కుట్రకోణం దాగిఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ సంక్షోభం ఉంది. దీన్ని కంట్రోల్ చేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్ అంచనా వేసింది.
విద్యుత్ కేంద్రాలపై దాడులుచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో ట్రంప్ వెనక్కి తగ్గారు. యుద్ధంలో ఇరాన్, అమెరికా ఓడిపోయాయి. యుద్ధంలో మరింత సైనిక ప్రణాళికలు అమలు చేయడానికి అమెరికా బ్రేక్ తీసుకుంది. అదునుచూసి మాపై దాడులు చేసేందుకు సన్నద్ధం కావడానికి ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసినట్లుగా ఉందని ఇరాన్ పేర్కొంది. దాడులకు ఐదు రోజుల బ్రేక్ అనేది అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడగానే భావిస్తాం. చర్చలే జరగడం లేదని ఇరాన్ మీడియా ఏజెన్సీల నుంచి వార్తలు వస్తున్నాయి.
