Iran: 26 రోజుల్లో 55 మందికి మరణశిక్ష అమలు చేసిన ఇరాన్
ఇరాన్ అధికారులు ఈ ఏడాది ఇప్పటికే 55 మందికి మరణశిక్ష అమలు చేశారని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్) సంస్థ తెలిపింది. 26 రోజుల్లో ఇంత మందికి మరణశిక్ష అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

Gunfire at anti hijab protestors in latest crackdown in iran
Iran: ఇరాన్ అధికారులు ఈ ఏడాది ఇప్పటికే 55 మందికి మరణశిక్ష అమలు చేశారని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్) సంస్థ తెలిపింది. 26 రోజుల్లో ఇంత మందికి మరణశిక్ష అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మరణశిక్ష పడిన వారిలో అధిక మంది డ్రగ్స్ సంబంధిత నిందితులు ఉన్నారని చెప్పింది.
అటువంటి వారు 37 మంది ఉన్నారని పేర్కొంది. ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనలకు సంబంధించి నలుగురికి మరణశిక్ష అమలు చేసినట్లు ఐహెచ్ఆర్ తెలిపింది. అంతేగాక, మరో 107 మంది ఉరిశిక్షను ఎదుర్కొనే ముప్పు ఉందని పేర్కొంది.
ఇరాన్ లో కొన్నేళ్లుగా మరణశిక్ష పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాజకీయ కారణాల వల్లే ఇంతమందికి ఇరాన్ మరణశిక్ష విధిస్తోందని ఐహెచ్ఆర్ తెలిపింది. మరోవైపు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కువ సంస్థ కూడా ఇరాన్ లో ముగ్గురు యువకులకు మరణశిక్ష విధించారని, వారిలో ఒకరికి 18 ఏళ్లు ఉంటాయని తెలిపింది. మరణశిక్షలు విధిస్తూ ఆందోళనకారుల్లో భయాన్ని నింపుతూ నిరసనలను అణచివేయాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.