Jail And Banishes Couple : డ్యాన్స్ చేసిన జంటకు జైలు శిక్ష, దేశ బహిష్కరణ

హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Jail And Banishes Couple : డ్యాన్స్ చేసిన జంటకు జైలు శిక్ష, దేశ బహిష్కరణ

DANCE

Updated On : February 1, 2023 / 3:08 PM IST

Jail And Banishes Couple : హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రభుత్వం ఆ జంటను అరెస్టు చేసింది.

ఇరాన్ లో గత కొన్ని నెలలుగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు 10 సంవత్సరాల 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ అనే బ్లాగర్ జంట ఇరాన్ హిజాబ్ వ్యతిరేక నిరసనకారులకు మద్దతుగా టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేశారు.

Hindu Boy Jailed In Pakistan : దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పాకిస్తాన్ లో హిందూ బాలుడికి జైలు శిక్ష

ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ జంటను నవంబర్ లో అరెస్టు చేశారు. వీరిద్దరూ ఇరాన్ జాతీయ భద్రతకు హాని కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రెవెల్యూషనరీ కోర్టు ఆరోపించింది. వీరి ఆన్ లైన్ కంటెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా నిషేధం కూడా విధించింది.

బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్ చేసినందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహించారన్న అభియోగాలతో కోర్టు ఆ జంటను దోషులుగా నిర్ధారించింది. ఈ జంటకు జైలు శిక్షతోపాటు సైబర్ స్పేస్ ను వినియోగించుకున్నందుకు 2 సంవత్సరాలు నిషేధం విధించారు. అంతేకుండా రెండేళ్ల పాటు ఇరాన్ నుంచి వారిని బహిష్కరిస్తున్నట్లు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.