Iraqi Protesters: ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం.. పార్లమెంట్ భవనంను ముట్టడించిన నిరసన కారులు..

ఇరాక్ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు శనివారం బాగ్దాద్ లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు.

Iraqi Protesters: ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం.. పార్లమెంట్ భవనంను ముట్టడించిన నిరసన కారులు..

Iraqi (1)

Updated On : July 30, 2022 / 8:43 PM IST

Iraqi Protesters: ఇరాక్ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు శనివారం బాగ్దాద్ లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు. షియా మతగురువు ముక్తదా అల్ సంద్రకు మద్దతుగా వందలాది మంది అనుచరులు బారికేడ్లు తొలగించి, గోడలు ఎక్కి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించి తమ నిరసనను తెలిపారు. పోలీసులు ఆందోళన కారులపై టియర్ గ్యాస్ ప్రయోగించినా, గాల్లోకి కాల్పులు జరిపినా లెక్క చేయకుండా పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు. అయితే ఇరాక్ లో పార్లమెంట్ భవనంను దిగ్భందించడం వారం రోజుల్లో ఇది రెండోసారి.

Iraqi Man: హజ్ పర్యటనకై ఇరాక్ వ్యక్తి 6వేల 500కిలోమీటర్ల పాదయాత్ర

ఆ దేశంలో 2021 అక్టోబర్ నెలలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముక్తదా అల్ సదర్‌కు చెందిన పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలను దక్కించుకోలేక పోయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముక్తదా నిర్ణయించారు. ప్రధాని ముక్తదా అల్ సదర్ కాకుండా విపక్షాలు ప్రధాని అభ్యర్థిగా మహమ్మద్ అల్ సుదానీని ప్రకటించాయి. దీన్ని ఇరాక్ మద్దతు దారులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పార్లమెంట్ భవనం వద్ద వేలాది మంది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తాజాగా శనివారం మరోసారి పార్లమెంట్ భవనంకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొని ముట్టడించారు.

JP Nadda: చదువుకున్న కాలేజీలోనే జేపీ నడ్డాకు చేదు అనుభవం.. వీడియో

అవినీతి రాజకీయ వర్గాన్ని తొలగించడానికి, పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించకుండా నిరోధించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేసేందుకు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నామని 41 ఏళ్ల రాద్ థాబెట్ అన్నారు.