Will you marry me : రైల్వే స్టేషన్‌లో అద్బుతమైన ప్రపోజల్

Will you marry me : రైల్వే స్టేషన్‌లో అద్బుతమైన ప్రపోజల్

Updated On : December 20, 2020 / 2:46 PM IST

Ireland man proposes to train-driver girlfriend : విల్ యూ మ్యారీ మీ అంటూ ఓ రైల్వే స్టేషన్‌లో యువతికి ప్రపోజల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అద్బుతమైన ప్రపోజల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నచ్చిన అమ్మాయికి వినూత్నంగా చేసిన ప్రపోజల్ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది. ప్రపోజల్ చేసిన వ్యక్తి ట్రైన్ డ్రైవర్, యువతి కూడా ట్రైన్ డ్రైవర్‌గా పని చేస్తుండడం విశేషం. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది.

కొనోర్ ఒసులివన్ (Conor O’Sullivan)..ఇతను డబ్లిన్ (Dublin station) ప్రాంతానికి చెందిన ఇతను ట్రైన్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను పౌలా కార్పోజియా (Paula Carbó Zea) అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈమె ట్రైన్ డ్రైవర్ గా పని చేస్తోంది. పౌలాకు ఎలాగైనా తన ప్రేమను వ్యక్తపరిచాలని అనుకున్నాడు. అందరిలాగా కాకుండా..వినూత్నంగా ప్రపోజల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకు తాను పనిచేస్తున్న రైల్వే స్టేషన్‌తేనే బాగుటుందని అనుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో..స్టేషన్‌కు వెళ్లిన..కొనోర్..ఫ్లాట్ ఫామ్‌పై ‘విల్ యూ మ్యారీ’ అనే అక్షరాలను ఒక్కో బోర్డుపై ఏర్పాటు చేశాడు. చివరి ప్లాట్ ఫామ్‌ వద్ద బొకే, షాంపైన్ బాటిల్ (champagne) పట్టుకుని నిలుచున్నాడు. కొంతమంది ఫొటోలు, వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు.

ఆ సమయంలో ట్రైన్ నడుపుతున్న పౌలా..ప్లాట్ ఫామ్‌లపై ఉన్న బోర్డులను చూస్తూ వస్తోంది. చివరి బోర్డు వద్ద కొనోర్‌ను చూసి ఆశ్చర్యానికి గురైంది. ట్రైన్ ఆపి అతని దగ్గరకు వెళ్లింది. పౌలా రాగానే మొకాళ్లపై కూర్చొని…‘విల్ యూ మ్యారీ మీ’ అని మొకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. ప్రేమను ఒప్పుకున్నట్లుగా..పైకి లేపి గట్టిగా హగ్ చేసుకుంది. అక్కడున్న వారందరూ కేరితలు కొడుతూ..వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు. దీనిని క్లోడా మహెర్ అనే వ్యక్తి కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా..పీల్సే స్టేషన్‌లో జరిగిన అద్భుతమైన ప్రపోజల్ అని రాసుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.