ఐసీస్ చీఫ్ బాగ్దాదీ బతికే ఉన్నాడు

  • Published By: vamsi ,Published On : April 30, 2019 / 04:45 AM IST
ఐసీస్ చీఫ్ బాగ్దాదీ బతికే ఉన్నాడు

Updated On : April 30, 2019 / 4:45 AM IST

ఇప్పటికి ఎన్నోసార్లు ఐసీస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఐసీస్ ఎప్పుడూ దృవీకరించలేదు. లేటెస్ట్ గా బాగ్దాదీ బతికే ఉన్నాడు అనే వాదనలకు బలం చేకూరుస్తూ.. ఓ వీడియో విడుదల చేసింది ఐసీస్. బాగ్దాదీ మాట్లాడుతున్న వీడియోను ఐఎస్‌ మీడియా గ్రూప్‌ అల్‌ ఫర్కాన్‌ విడుదల చేసింది.

2014 జులైలో చివరిసారిగా ఓ వీడియో ద్వారా ప్రపంచానికి కనిపించిన అబూ బకర్‌, 2015 మార్చి 18న సిరియా సరిహద్దు రాష్ట్రం నినెవే దగ్గర చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. బాగ్ధాదీ చనిపోయినట్లు వచ్చిన వార్తలను అమెరికా, రష్యా దేశాలు ధ్రువీకరించాయి. ఇరాకీ టెలివిజన్‌ మాత్రం బాగ్దాదీ బతికే ఉన్నట్లు చెబుతూ వచ్చింది.

కొత్తగా విడుదలైన వీడియోలో బాగ్దాదీ ముఖకవళికలు చూస్తుంటే ఇప్పటి వీడియోనే అని ప్రపంచ మీడియా చెబుతున్నప్పటికీ, సీఎన్‌ఎన్‌, బీబీసీ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.