అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడులు, 15 మంది మృతి…కాల్పుల విరమణను తిరస్కరించిన నెతన్యాహు
గాజాపై ఇజ్రెయెల్ దళాల దాడిలో 15 మంది మరణించారు. గాజాలో రోగులతో వెళుతున్న అంబులెన్సుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేయడంతో 15 మంది మరణించారని హమాస్ తెలిపింది....

Israeli strike on ambulance
Israeli strike on ambulance : గాజాపై ఇజ్రెయెల్ దళాల దాడిలో 15 మంది మరణించారు. గాజాలో రోగులతో వెళుతున్న అంబులెన్సుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేయడంతో 15 మంది మరణించారని హమాస్ తెలిపింది. ఉత్తర గాజా నుంచి క్షతగాత్రులను తరలించడానికి ఉపయోగించే అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 15 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరణ
కాగా గాజాలో పౌరులకు సహాయం అందించడానికి వీలుగా కాల్పుల విరమణను పాటించాలని యూఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ ను కోరారు. యూఎస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. బందీలందరినీ విడుదల చేస్తేనే సైనిక చర్యకు విరామం ఇస్తామని నెతన్యాహు నొక్కి చెప్పారు. గాజాకు సహాయం అందించడానికి మానవతావాద విరామం గురించి చర్చించినట్లు చెప్పారు.
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాలో రాత్రిపూట తన కార్యకలాపాలను కొనసాగించింది. సైన్యం పలు హమాస్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో కార్యకర్తలను చంపినట్లు ఐడీఎఫ్ నివేదించింది. అక్టోబరు 7వతేదీ నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 9,227 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 3,826 మంది పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో 1,400 మంది మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా ఆపరేషన్‌లో విరామం కోసం బ్లింకెన్ చేసిన పిలుపును తిరస్కరించారు.
Also Read : Nepal Earthquake : నేపాల్ భూకంపం ఎఫెక్ట్…128కి పెరిగిన మృతుల సంఖ్య, 140 మందికి గాయాలు
హమాస్ బందీలందరినీ విడుదల చేసే వరకు సైనిక దాడి కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి వెలుపల అంబులెన్స్‌పై దాడి చేసింది. ‘‘మేం ఉత్తర గాజా ప్రాంతం యుద్ధ ప్రాంతమని నొక్కి చెబుతున్నాం. ఈ ప్రాంతంలోని పౌరులు తమ భద్రత కోసం దక్షిణం వైపునకు వెళ్లాలని పదేపదే పిలుపునిచ్చాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. కాగా ఉగ్రవాద చర్యల కోసం హమాస్ అంబులెన్స్‌ను వినియోగించుకుంటోందన్న అదనపు సమాచారాన్ని ఇజ్రాయెల్ సైన్యం పంచుకుంది.
Also Read : Delhi Air pollution : ఢిల్లీలో వాయుకాలుష్యం ఎఫెక్ట్…ప్రజలు ఇళ్లలోనే ఉండండి, అనవసర ప్రయాణాలు వద్దు
గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి దగ్గరగా ఉన్న రోగులను తరలించే అంబులెన్స్‌లపై దాడులు చేసిన ఘటన తెలిసి తాను షాక్ అయ్యానని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. సౌదీ, ఖతార్, ఎమిరాటీ, ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు పాలస్తీనా ప్రతినిధులను శనివారం అమ్మాన్‌లో అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ కలుస్తారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.