Gaza: గాజాలో ఇజ్రాయెల్ స్ట్రైక్స్.. 14 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం జోన్ పరిధిని విస్తరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం.

గాజాలో ఇజ్రాయెల్ చేసిన రెండు స్ట్రైక్స్‌లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ సహా 14 మంది మరణించారని పాలస్తీనా వైద్య అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ మానవతా జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఎక్కువ మంది మరణించారని చెప్పారు.
గత అర్ధరాత్రి ఖాన్ యూనిస్ నగరానికి పశ్చిమాన ఉన్న మువాసి హ్యుమానిటేరియన్ జోన్‌లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఓ స్ట్రైక్ జరిగింది. ఇందులో ఇద్దరు పిల్లలు సహా 11 మంది మృతి చెందారని నాసర్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.
రెండో స్ట్రైక్ ఇవాళ ఉదయం సెంట్రల్ గాజాలోని అర్బన్ నుసెరాత్ శరణార్థి శిబిరంలోని ఓ ఇంటిపై జరిగింది. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఓ మహిళ ఉన్నారని అల్-అవ్దా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
ఈ స్ట్రైక్‌లో మరో 11 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం జోన్ పరిధిని విస్తరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల 13 నెలల్లో 43,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతి చెందిన వారిలో సగానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి