ప్లీజ్ పిల్లల్ని కనండి..లక్షల రూపాయలిస్తాం..

Japan : ప్లీజ్..దయచేసి పిల్లల్ని కనండి..మీ ఇంటి అద్దె ఖర్చులతో పాటు లక్షల రూపాయలిస్తాం అంటూ జపాన్ ప్రభుత్వం బతిమాలుకుంటున్నా సరే ప్రజలు పిల్లల్ని కనటానికి ఇష్టపడటంలేదు. ఎంతసేపు వర్క్..వర్క్..వర్క్. ఇలాగే రోజులు..వారాలు..నెలలు..సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాసరే పిల్లల్ని కనటానికి తీరికలేనంత పనితో ఎప్పుడూ పని పని అంటున్నారు.
దీంతో దేశంలో జననాలు తగ్గిపోతున్నాయి. మరోపక్క వృద్ధులు పెరిగిపోతున్నారు. దీంతోప్రభుత్వం ఉద్యోగులకు పని మానండీ..పిల్లల్ని కనండి..పిల్లల్ని కంటే 4 రూ. లక్షలు ఇస్తాంఅంటే ఆఫర్లు ప్రకటిస్తోంది.
https://10tv.in/priest-raises-his-hand-blessed-to-the-girl-she-gives-high-five-to-him-video-goes-viral/
ప్రపంచ దేశాల్లో పారిశ్రామిక రంగంలో జపాన్ ఎప్పుడూ ఫస్టే ఉంటుంది. జపాన్ ప్రజలకు పనిచేయటమంటే ఎంతో ఇష్టం..ఎంత ఇష్టం అంటే పెళ్లిచేసుకోవటానికి కూడా తీరిక లేనంత పనిచేయటం మంటే ఇష్టం..పెళ్లి చేసుకున్నా..పిల్లల్ని కనటానికి కూడా తీరికలేనంత ఇష్టం..దీన్ని ఇష్టం అనటం కంటే పని అంటే పిచ్చి అనటం కరెక్ట్.
ఉత్పత్తుల్ని పెంచుకుంటూ పోయే జపాన్ ప్రజలు పిల్లల్ని ఉత్పత్తి (సంతానోత్పత్తి) చేయటానికి ఇష్టపడటంలేదు. ఈ పరిస్థితే దేశానికి మానవ వనరుల్ని తగ్గిపోయే ప్రమాదస్థితికి కారణమవుతోంది. దేశాన్ని ఊహించని కష్టాల్లోకి నెడుతోంది.
ప్రతి ఏటా సంతానోత్పత్తి అంతకంతకూ తగ్గిపోతోంది. జపాన్ ప్రజల్లోవైవాహిక బంధం, భార్య భర్తల ఏకాంతం తగ్గిపోవడం (కాపురం చేసే సమయం)తో జననాలపై ప్రభావం పడింది. గత 25 సంవత్సరాలనుండి జపాన్ వృద్ధుల సంఖ్య పెరుగుతూ.. సంతానలేమి ఏర్పడుతోంది. దీనికి సరైనా చర్యల కోసం ప్రభుత్వం కొత్త పథకం అందుబాటులోకి తెచ్చింది. పెళ్లి చేసుకునే జంటకు 6,000 yen (ఇండియా కరెన్సీలో రూ. 4 లక్షలకుపైగా) అందించాలని నిర్ణయించింది.
దేశంలో జననాల రేటు పెరగాలంటే యువ జంటలకు నగదు బహుమతి ఆఫర్ చేసింది. చాలా మంది ఆదాయ వేటలో పడి పెళ్లి అనే మాటను మర్చిపోవడంతో ఈ విధంగా చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు రూ. 4 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
దీని వల్ల కొత్తగా కాపురం పెట్టే జంట ఇంటి అద్దె, ఇతర అవసరాలకు సరిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం వల్ల దేశంలో మళ్లీ జననాల రేటు పెరుగుతుందని ఆకాంక్షిస్తోంది ప్రభుత్వం. అయితే 40 ఏళ్ల వయసు లోపు ఏడాదికి రూ. 5.4 లక్షల జీతం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది.