Japan China war : జపాన్ వర్సెస్ చైనా.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం.. జపాన్‌ యుద్ధ విమానాలపై చైనా జె-15ల గురి

Japan China war : జపాన్, చైనా సైన్యాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకినావా దీవుల సమీపంలో జపాన్ యుద్ధ విమానాలకు చైనా సైనిక విమానాలు ..

Japan China war : జపాన్ వర్సెస్ చైనా.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం.. జపాన్‌ యుద్ధ విమానాలపై చైనా జె-15ల గురి

Japan China

Updated On : December 8, 2025 / 1:39 PM IST

Japan China war : జపాన్, చైనా సైన్యాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకినావా దీవుల సమీపంలో జపాన్ యుద్ధ విమానాలకు చైనా సైనిక విమానాలు తమ రాడార్‌ను లాక్ చేశాయని ఆరోపణలు రావడంతో జపాన్, చైనా దేశాల మధ్య దౌత్య వివాదం తీవ్రమైంది.

Also Read: 2025లో గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా వెతికింది వీరికోసమే.. టాప్-10 జాబితా ఇదే..

తైవాన్ పై చైనా దురాక్రమణ చేస్తే తాము రంగంలోకి దిగే అవకాశముందని జపాన్ ప్రధాని సనాయో టకాయిచి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జపాన్ ప్రధాని వ్యాఖ్యలకు చైనాసైతం ధీటుగా స్పందించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో జపాన్, చైనా సైన్యాల మధ్య తాజా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య మరింత ఉధ్రిక్తతలకు దారితీశాయి.

తమకు చెందిన రెండు ఎఫ్-15 యుద్ధ విమానాలను చైనా జెట్‌లు రాడార్ లాక్ చేశాయని జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయ్‌జుమి ఆదివారం వెల్లడించారు. క్షిపణిని శత్రు విమానాలపైకి ప్రయోగించే ముందు ఈ ప్రక్రియను అవలంభిస్తారు. సాధారణ సమయాల్లో  ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత దుందుడుకు చర్య అని నిపుణులు పేర్కొన్నారు.

షింజిరో కొయ్‌జుమి ప్రకారం.. ‘‘ఒకినావా తీరానికి దగ్గరలో చైనా నేవీకి చెందిన జె-15 విమానాలు గాల్లోకి ఎగిరాయి. మా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోనే ఉంటూ వాటిని గమనిస్తున్నాయి. ఇంతలో వారు రాడార్ లాక్ చేసినట్లు హెచ్చరిక అందింది. ఇలా వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. ఈ ఘటనపై చైనా అధికారులకు మా అసంతృప్తిని తెలియజేశాం’’ అని అన్నారు.

షింజిరో కొయ్‌జుమి వ్యాఖ్యలపై చైనా స్పందించింది. చైనా అధికార ప్రతినిధి వాంగ్ గ్జూమెంగ్ మాట్లాడుతూ.. జపాన్ విమానాలు తమను పదేపదే వేధిస్తుండటంతో నిబంధనలకు లోబడే హెచ్చరించామని చెప్పారు. తమ విన్యాసాల గురించి ముందు ప్రకటించామని చైనా పేర్కొంది. ఇదిలాఉంటే.. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. తాజా పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెల రోజులుగా చైనా, జపాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా తన పౌరులను జపాన్‌కు వెళ్లకుండా ఉండమని కోరింది. అంతేకాక.. జపాన్ నుంచి సముద్ర ఆహార దిగుమతులను చైనా నిషేధించింది. ప్రసిద్ధ జపనీస్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేసింది.