Red Color River : ఎర్రగా మారిపోయిన నది .. క్షమాపణ చెప్పిన బీరు కంపెనీ

నది నీరు ఎర్రగా మారిపోయింది. బీరు కంపెనీ క్షమాపణలు చెప్పింది. మళ్లీ ఇలా జరగకుండా చూస్తామని నగరవాసులంతా క్షమించాలని కోరింది.

Red Color River : ఎర్రగా మారిపోయిన నది .. క్షమాపణ చెప్పిన బీరు కంపెనీ

Japan River Turns Blood Red

Updated On : June 29, 2023 / 6:04 PM IST

River water Red Color in Japan : జపాన్ (Japan) లోని ఒకినావా(Okinawa)లోని నాగో నగరం(Nago City)లో పారే నది (River)హఠాత్తుగా ఎర్రగా (blood red)మారిపోవటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎర్రగా మారిపోయిన నది ఫోటోలు..సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనిపై ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీ (Orion Breweries)యాజమాన్యం స్పందించింది. నగరవాసులకు క్షమాపణలు చెప్పింది. నది ఎర్రగా మారితే బీరు కంపెనీ క్షమాపణలు చెప్పటానికి కారణమేంటా అనుకుంటున్నారా? నది రంగు మారటానికి కారణం ఒరియాన్‌ బీర్‌ ఫ్యాక్టరీ (Orion Breweries)కి చెందిన కూలింగ్ వ్యవస్థల్లో ఒకదానిలో ఏర్పడిన లీకేజీనేనని తెలిపింది.

UK PM Rishi Sunak Pen : రిషి సునక్ పెన్నుపై వివాదం, అసలు ఏంటా పెన్ను..? ఎందుకీ ఆందోళన..?

ఆహారపదార్థాల్లో ఉపయోగించే రంగు( food colour) పొరపాటున లీక్‌ అయింది. అది నదిలోకి విడుదల కావడంతో నీరంతా ఎరుపురంగులోకి మారిపోయింది. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని సదరు సంస్థ ప్రకటించింది. దీనికి తమను మన్నించాలని కోరింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. మా ఫ్యాక్టరీలో కూలింగ్ వ్యవస్థలో జరిగిన సాంకేతిక లోపంతో ఇలా కలర్ లీక్ అయ్యిందని వెల్లడించింది.

దీనిపై బీర్ కంపెనీ ప్రెసిడెంట్ (beer company beer company)హజిమ్ మురానో (Hajime Murano Hajime Murano)మాట్లాడుతూ..నది నీరు ఎరుపు రంగులో మారటానికి ప్రొపిలీన్ గ్లైకాల్ ( propylene glycol)కారణమని మేం భావిస్తున్నామని తెలిపింది.మా ఫ్యాక్టరీ ఫెసిలిటీలను చల్లబరచడానికి ఉపయోగించే కూలింగ్ చేసే నీటిలో ఇది ఉంటుందని..అక్కడి నుంచి లీక్‌ అయిన నీరు రెయిన్‌ గట్టర్ ద్వారా నదిలో కలిసిపోయి ఉంటుందని..అందుకే నది నీరు రంగు మారి ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది. అదే రంగు మార్పునకు కారణమని భావిస్తున్నాం’అని తెలిపింది.

France: ఫ్రాన్స్‌లో భారీగా చెలరేగుతున్న ఆందోళనలు.. కనపడిన వాటిని తగులబెడుతున్న నిరసనకారులు.. ఎందుకంటే?

కాగా గత మంగళవారం (జూన్.2023) లీక్‌ మొదలైందని..తరువాత తగిన మరమత్తులు చేయటం వల్ల లీకేజీ బంద్ అయిందని స్థానిక మీడియా (Japanese media reports)పేర్కొంది.