Japanese Company Offer : జపాన్ కంపెనీ అదిరే ఆఫర్.. సైకిల్ తొక్కి సాక్సులు కుట్టుకోవచ్చు!
Japanese Company Offer : జపాన్ కంపెనీ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కస్టమర్లకు అదిరే ఆఫర్ ప్రకటించింది. సాక్స్ కొనేవారికి కుట్టుకునే అవకాశాన్ని కల్పించింది.

Japanese Factory Lets You Knit Your Own Socks By Riding A Bicycle
Japanese Company Offer : జపాన్ కంపెనీ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కస్టమర్లకు అదిరే ఆఫర్ ప్రకటించింది. సాక్స్ కొనేవారికి కుట్టుకునే అవకాశాన్ని కల్పించింది. అంటే.. మీకు నచ్చిన సాక్స్ మీరే కుట్టుకోవచ్చు. జపాన్‌లోని నారా ప్రిఫెక్చర్‌లోని సౌకీ సాక్స్ అనే చిన్న సాక్స్ ఫ్యాక్టరీ ఉంది.. ఇక్కడ సైకిల్‌పై తొక్కడం ద్వారా కస్టమర్లు తమ సొంత సాక్స్‌లను వారే అల్లుకోవచ్చు. ఇందుకోసం ఆ జపాన్ కంపెనీ కొత్త యంత్రాన్ని కూడా రూపొందించింది. సరదాగా కస్టమర్లు ఎవరైనా సరే తమకు నచ్చిన సాక్సు వారికివారే కుట్టుకోవచ్చు. ఇందుకు కుట్టడం రావాల్సిన పనిలేదు. చేయాల్సిందిల్లా.. సైకిల్ యంత్రంపై సరదాగా కూర్చొని ఈ సాక్సులను కూర్చోవచ్చు. సౌకీ సాక్స్‌ల తయారీలో కస్టమర్లను ఉత్తేజపరిచేందుకు ఈ కొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చింది.

Japanese Factory Lets You Knit Your Own Socks By Riding A Bicycle
అయితే కొత్త విధానం ద్వారా కస్టమర్ల ప్రీగా సాక్స్ తయారుచేసుకునేలా అవకాశాన్ని కల్పించింది. ఎవరి సాయం లేకుండానే సైకిల్ మీద కూర్చొని తొక్కడం ద్వారా మెషిన్ లోపలి నుంచి సాక్స్ బయటకు వచ్చేస్తాయి. సైకిల్ తొక్కితే సాక్స్ రెడీ అయిపోతాయి. ఇంతకీ మెషన్ పేరు ఏంటంటే? చరిక్స్.. 2017లో జపాన్ లో నారా ప్రిఫెక్చర్‌లో సౌకీ సాక్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టిరీలో నచ్చిన రంగుల్లో నచ్చిన సైజులో కస్టమర్లే సాక్సులను తయారుచేసుకోవచ్చు. ఈ యంత్రం 2017లో ప్రారంభించబడినప్పటి నుంచి కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది.

Japanese Factory Lets You Knit Your Own Socks By Riding A Bicycle
1990వ దశకంలో జపాన్‌లో వదులుగా ఉండే సాక్స్‌లు అల్లడం మెషీన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. సౌకీ సాక్స్ ఈ మెషీన్‌లను ఫ్యాక్టరీ సందర్శకులు వారికి వారే వదులుగా ఉన్న సాక్స్‌లను అల్లుకునేందుకు అవకాశం కల్పించింది. సైకిల్ ఎక్కి 10 నిమిషాల పాటు తొక్కితే చాలు.. సాక్స్ రెడీ అవుతాయి. చివర్లో కుట్టేసి కస్టమర్లకు అందిస్తారు అనమాట.. అంతేకాదు.. ఈ సాక్సులను ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. Charix ఆన్‌లైన్ ద్వారా ఒక జత సాక్స్ ధర 2200 యెన్ ($18.50) వరకు ఉంటుంది. పెడలింగ్ ప్రారంభించే ముందు సాక్స్‌ల పరిమాణాన్ని థ్రెడ్‌ల రంగులను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక సిబ్బంది థ్రెడ్‌లను మెషీన్‌కు కలుపుతారు. ఒక జత సాక్స్‌లను తయారు చేయడానికి సుమారు 10 నిమిషాలు పడుతుంది. సైకిల్ పెడలింగ్ పూర్తి చేసిన తర్వాత, సిబ్బంది కాలి వేళ్లను కుడతారు. అల్లిన సాక్స్‌లను అప్పటికప్పుడే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. వాస్తవానికి, పెడల్-అల్లిన సాక్స్‌లకు డిమాండ్ చాలా ఎక్కువే. సాక్సులను కస్టమర్లు వారికి వారే ఎలా తయారుచేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియో ఇదే..
Read Also : Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!