Rare whiskey : ఈ విస్కీ బాటిల్ ధర రూ 4.14 కోట్లు..!
ఒకే ఒక్క విస్కీ బాటిల్ రూ.4.14 కోట్లు ధరకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది.

Rare Japanese Whiskey Bottle For Rs 4.14 Crore
Rare Japanese whiskey bottle for Rs 4.14 crore : ఒకే ఒక్క విస్కీ బాటిల్ ధర కోట్ల రూపాయలు పలికింది. విస్కీ, వైన్ ఎంత పురాతనమైనవి అయితే అంత డిమాండ్ అనే విషయం తెలిసిందే. అలా ఓ విస్కీబాటిల్ ఏకంగా కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. జపాన్‌కి చెందిన లిక్కర్ సంస్థ తయారు చేసిన ఓ విస్కీ బాటిల్ రూ.4.14 కోట్లు ధరకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులోని యునిఫ్రీ డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వేలం పాటలో పెట్టారు. ఈ ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకోవటానికి ఔత్సాహికులు పోటీ పడ్డారు. అలా ఎనిమిదిమంది ఈ బాటిల్ ను దక్కించుకోవానికి పోటా పోటీగా వేలం పాట పోటీలో పాల్గొన్నారు. అలా వేలంలో ధర పెరిగి పెరిగి చివరకు చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు ఈ బాటిల్ ను 4,88,000 పౌండ్లుకు సొంతం చేసుకున్నాడు. అంటే మన కరెన్సీలో రూ.4.14 కోట్లకు ఈ అరుదైన విస్కీ బాటిల్ ను దక్కించుకున్నాడు. ఈ విస్కీ ఇంత ధరకు అమ్ముడుపోవటంపై డ్యూటీ ఫ్రీ సీఈవో అలీ హేన్ హర్ ఆనందం వ్యక్తంచేశారు. మా స్టోర్‌లో ఈ రికార్డ్ బ్రేకింగ్ సేల్ జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎందుకంత ధర? దీని ప్రత్యేకతలేంటీ?
Also read : Wine Bottle Price: ఈ వైన్ బాటిల్ ధర రూ.7.37 కోట్లు
సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి ఈ ది యమజాకి విస్కీని ప్రత్యేకంగా తయారు చేశారు. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్ బ్లెండర్ షింజిరో ఫికియో తెలిపారు. ఇదొక అందమైన గ్రీకు శిల్పంలాంటిదని అందుకే అంత ధర పలికిందని అన్నారు.
సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిలెడ్‌గా మార్కెట్‌లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది. 2020లో కేవలం 100 విస్కీ బాటిల్స్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేసింది.
Also read : Water Bottle Cost: ముప్పావు లీటర్ వాటర్ ఖరీదు.. రూ.45లక్షలా