Wine Bottle Price: ఈ వైన్ బాటిల్ ధర రూ.7.37 కోట్లు

సాధారణంగా మద్యం ధరలను అది ఇచ్చే కిక్కుని బట్టి నిర్ణయిస్తాయి కంపెనీలు. ఇక మద్యం తయారీకి వాడే పదార్దాలను బట్టికూడా మద్యం ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.. ఎంత మంచి కిక్కిచ్చే మద్యం అయినా మనదేశంలో లక్షలోపు దొరుకుతుంది.

Wine Bottle Price: ఈ వైన్ బాటిల్ ధర రూ.7.37 కోట్లు

Seven Crores Wine Bottle

Wine Bottle Price: సాధారణంగా మద్యం ధరలను అది ఇచ్చే కిక్కుని బట్టి నిర్ణయిస్తాయి కంపెనీలు. ఇక మద్యం తయారీకి వాడే పదార్దాలను బట్టికూడా మద్యం ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.. ఎంత మంచి కిక్కిచ్చే మద్యం అయినా మనదేశంలో లక్షలోపు దొరుకుతుంది. ఇక విదేశాల నుంచి తెప్పించుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ ధర ఉంటుంది. వీటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్ ఏకంగా కోట్ల రూపాయలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ వైన్ బాటిల్ కి ఇంత రేటు అంచనా వేయడానికి కారణం దీనిని అంతరిక్షం నుంచి తీసుకురావడమే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఏడాదికిపైగా గడిపిన ఒక ఫ్రెంచ్‌ వైన్‌ బాటిల్‌ను క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. దీని ధర 10 లక్షల డాలర్ల వరకు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తుంది క్రిస్టీస్ సంస్థ. అంటే భారత కరెన్సీలో దీని ధర 7 కోట్ల 37 లక్షలకు పైమాటే. 2019లో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్ బాటిల్స్ లో ఇది ఒకటి. దీని పేరు పెట్రస్ 2000.

భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వీటిని భూమికి తీసుకొచ్చారు. దీనిపై ప్రాన్స్ లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌ పరిశోధనలు నిర్వహించింది. దీనికి రుచి పరిక్షలు నిర్వహించి పానీయం రుచితో పాటు మంచి వాసనా వస్తుందని తెలిపారు. ఈ వైన్‌ మంచిగా పులిసిందని, తాగడానికి సిద్ధంగా ఉందని క్రిస్టీస్‌ వైన్‌ అండ్‌ స్పిరిట్స్‌ విభాగం డైరెక్టర్‌ టిమ్‌ టిప్‌ట్రీ తెలిపారు.