Richard Dawkins Award గెలుచుకున్న ఒకే ఒక్క ఇండియన్ Javed Akhtar 

  • Published By: Subhan ,Published On : June 7, 2020 / 02:35 PM IST
Richard Dawkins Award గెలుచుకున్న ఒకే ఒక్క ఇండియన్ Javed Akhtar 

Updated On : June 7, 2020 / 2:35 PM IST

లిరిక్ రైటర్ Javed Akhtarను Richard Dawkins Award వరించింది. మానవతా విలువలు, నిశితమైన పరిశీలన, మతపరమైన హెచ్చుతగ్గులు లేకపోవడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు.  అక్తర్ కు మాత్రమే ఈ అవార్డు దక్కింది. గతంలో బిల్ మహెర్, క్రిస్టోఫర్ హిచెన్స్ లు ఈ గౌరవం దక్కించుకోగలిగారు. 

అక్తర్.. గతంలో కొన్ని ట్వీట్లపైనా స్పందించారు.  CAA, Tablighi Jamaat, islamophobia వంటి టాపిక్ లపై బాధ్యతగల ఇండియన్ సినిమా లిరికిస్ట్ గా స్పందించారు. ఈ అవార్డును సెక్యూలరిజం, రేషనలిజం, సైంటిఫిక్ ట్రూత్ వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడిన వారికి అందజేస్తారు. 

రిచర్డ్ డాకిన్స్ అవార్డ్ అనేది వార్షిక అవార్డు. అమెరికాకు చెందిన Atheist కూటమి ఈ అవార్డు ప్రెజంట్ చేయనుంది.