Jeff Bezos: ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్.. ఖరీదైన బోటులో కేన్స్‌‌లో ఎంట్రీ..

శాంచెజ్ తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకోగా.. బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్ నుండి విడాకులు తీసుకొని తన 25ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు.

Jeff Bezos: ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్.. ఖరీదైన బోటులో కేన్స్‌‌లో ఎంట్రీ..

Jeff Bezos and Lauren Sanchez

Updated On : May 23, 2023 / 11:35 AM IST

Jeff Bezos – Lauren Sanchez: బిలియనీర్‌, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ అతని ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను వారు ధృవీకరించినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

Jeff Bezos and Lauren Sanchez

Jeff Bezos and Lauren Sanchez

ప్రస్తుతం వారిద్దరూ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఖరీదైన బోటులో కేన్స్ కు చేరుకున్నారు. వారు సూపర్ యాచ్ బోటులో కేన్స్ కు చేరుకున్నారట. ఆ బోటు విలువ సుమారు రూ.4 వేల కోట్లకుపైనే ఉంటుందని తెలిసింది.

Jeff Bezos and Lauren Sanchez

Jeff Bezos and Lauren Sanchez

59 ఏళ్ల బిలియనీర్ బెజోస్, ప్రముఖ ప్రసార జర్నలిస్ట్ శాంచెజ్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే, 2019లో వీరిద్దరూ తమ తమ జీవిత భాగస్వాముల నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Jeff Bezos and Lauren Sanchez

Jeff Bezos and Lauren Sanchez

శాంచెజ్ తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకోగా.. బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్ నుండి విడాకులు తీసుకొని తన 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. బెజోస్, స్కాట్ లకు నలుగురు పిల్లలు ఉన్నారు. శాంచెజ్, వైట్ సెల్ జంటకు ఇద్దరు టీనేజ్ పిల్లలు ఉన్నారు.

Jeff Bezos and Lauren Sanchez

Jeff Bezos and Lauren Sanchez

ఇటీవలి కాలంలో వీరిద్దరు నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. కళ్లుచెదిరే హృదయం ఆకారంలో కలిగిన ఉంగరాన్ని మార్చుకోవటం ద్వారా నిశ్చితార్ధం చేసుకున్నారని, త్వరలో వారు వివాహం చేసుకోబుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, నిశ్చితార్థం చేసుకున్నట్లు వారు ధృవీకరించారని ఓ ఆంగ్ల పత్రిక తాజాగా పేర్కొంది.