Khalistani terrorist Hardeep Singh :కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చివేత
ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది....

ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చివేత
Khalistani terrorist Hardeep Singh shot dead: ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్(wanted in India) ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2022వ సంత్సరంలో జలంధర్ నగరంలో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని హర్దీప్ సింగ్ పై ఆరోపణలు రావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని పట్టిచ్చిన వారికి రూ.10లక్షల రివార్డు ప్రకటించింది.
Heavy Rainfall in Tamil Nadu:పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..తమిళనాడులో స్కూళ్లకు సెలవులు
పూజారి హత్యకు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) కుట్ర పన్నింది.గతంలో భారత్‌పై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నిన కేసులో నిజ్జర్‌పై ఎన్‌ఐఏ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని పంజాబీ ఆధిపత్యం గల సర్రే నగరంలోని గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి వేశారు. అతను సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.