Israeli Strike : పిల్లలు ఆడుకుంటుండగా.. గాజా ఆశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది దుర్మరణం!

Israeli Strike : ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 13 మంది చిన్నారులు, 6 మహిళలు ఉన్నారని హమాస్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Israeli Strike : పిల్లలు ఆడుకుంటుండగా.. గాజా ఆశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది దుర్మరణం!

Kids Were Playing _ Israeli Strike Kills

Updated On : September 21, 2024 / 9:32 PM IST

Israeli Strike : ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరపోరు జరుగుతోంది. దక్షిణ గాజా సిటీలో శనివారం (సెప్టెంబర్ 21)న జరిగిన ఇజ్రాయెల్ దాడిలో 22 మంది మృతిచెందారు. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలలో ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించారని పాలస్తీనియన్లు తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు పేర్కొన్నారు.

Read Also : ఇలా జరగడం పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం: మోహన్ బాబు

ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 13 మంది చిన్నారులు, 6 మహిళలు ఉన్నారని హమాస్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పాత పాఠశాల కాంపౌండ్‌లో హమాస్ కమాండ్ సెంటర్‌ను తాకినట్లు సైన్యం తెలిపింది. సైనిక అవసరాల కోసం పౌర సౌకర్యాలను ఉపయోగిస్తుందనే ఆరోపణలను హమాస్ తీవ్రంగా ఖండించింది.

దాడి జరిగిన ప్రదేశంలో పేలిన గోడలు, ధ్వంసమైన, కాలిపోయిన ఫర్నిచర్, ఒక గది పైకప్పులోని రంధ్రాలు కనిపించాయని రాయిటర్స్ తెలిపింది. “స్కూల్ ప్లేగ్రౌండ్‌లో మహిళలు, వారి పిల్లలు కూర్చుని ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా రెండు రాకెట్లు దూసుకొచ్చాయి’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

ఘటనా స్థలంలో అంబులెన్స్‌లు మృతదేహాలను తరలిస్తుండగా, మరికొంతమంది చనిపోయిన వారిని దుప్పట్లతో చుట్టి గాడిద బండ్లపై తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ దాడిలో దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫాలో, మినిస్ట్రీ గిడ్డంగులపై రాకెట్లను పేల్చడంతోనలుగురు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

యుద్ధాన్ని ముగించి ఇజ్రాయెల్ దళాలను గాజా నుంచి వెనక్కి పంపాలనే ఒప్పందంపై దృష్టి సారించామని హమాస్ చెబుతుండగా, హమాస్ నిర్మూలన తర్వాత మాత్రమే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది. దశాబ్దాల నాటి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంతో ఈ యుద్ధం అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో మొదలైంది.

ఈ దాడుల్లో 1,200 మంది మృతిచెందారు. దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ దాడిలో 41వేల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లను పొట్టనపెట్టుకుంది. దాంతో దాదాపు 2.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

Read Also : దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలపై తిరుమల లడ్డూ ఎఫెక్ట్.. కీలక ఆదేశాలు జారీ..