suicide attack drones: ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయండి.. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశం
లక్ష్యాలపై దూసుకెళ్లి పేలిపోయే మానవరహిత ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి వాటి పనితీరును

Kim jong un
Kim jong un : లక్ష్యాలపై దూసుకెళ్లి పేలిపోయే మానవరహిత ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి వాటి పనితీరును పర్యవేక్షించారు. అయితే, ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనంలో పేర్కొంది. అత్యంత తేలిగ్గా వాడే పవర్ ఫుల్ ఆయుధమే సూసైడ్ డ్రోన్స్ అని కిమ్ అభివర్ణించారని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర కొరియా తొలిసారి సూసైడ్ డ్రోన్లను ప్రదర్శించింది. అయితే, ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లను ప్రస్తుత డ్రోన్లు పోలి ఉన్నాయని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సైనిక అధికారులతో కిమ్ మాట్లాడుతున్న ఫొటోలు విడుదల చేసింది. ఈ డ్రోన్లు ఒక బీఎండబ్ల్యూ కారును, పాత యుద్ధ ట్యాంకులను ఢీకొని పేల్చివేసిన దృశ్యాలను ప్రసారం చేసింది.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
నివేదికల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ కొత్త డ్రోన్ల పని తీరుపట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. డ్రోన్లు ఈరోజుల్లో సైనిక చర్యల్లో అవసరంగా మారిందని, మిలిటరీ సామర్థ్యాల్లో డ్రోన్లను ప్రధాన సాధనంగా ఉపయోగించడం పోటీ ప్రపంచంలో అనివార్యంగా మారిందని కిమ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ డ్రోన్ల తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు. సైనిక అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున తయారు చేయాలని, చవకైన ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ జలాల్లో అమెరికా, దక్షిణకొరియా, జపాన్ లు ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టిన తరుణంలో ఉత్తర కొరియా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించడం గమనార్హం. ఇప్పటికే రష్యా సేనలతో కలిసి యుక్రెయిన్ సరిహద్దుల్లోకి ఉత్తరకొరియా సైన్యం చేరింది. ఇలాంటి సమయంలో కిమ్ తన అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ప్రపంచ దేశాల్లో మరింత ఆందోళనకరంగా మారాయి.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ప్రయోగించిన ఆత్మాహుతి దాడి డ్రోన్‌ల పనితీరు పరీక్షలో వాహనం దగ్ధమైనట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా శుక్రవారం విడుదల చేసిన ఫోటో.