Viral Video : పాము నుంచి కప్పను కాపాడిన చిరుత

ఈ భూమిమీద జరిగే వింతల్లో కెమెరా కళ్ళకు చిక్కనివి, మనకు కనిపించనివి చాలానే ఉంటాయి. అయితే ఇలాంటి వింతల్లో కొన్ని కెమెరా కంట చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Viral Video : పాము నుంచి కప్పను కాపాడిన చిరుత

Viral Video

Updated On : November 23, 2021 / 8:26 AM IST

Viral Video :  ఈ భూమిమీద జరిగే వింతల్లో కెమెరా కళ్ళకు చిక్కనివి, మనకు కనిపించనివి చాలానే ఉంటాయి. అయితే ఇలాంటి వింతల్లో కొన్ని కెమెరా కంట చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. లక్షల్లో లైక్స్, కోట్లలో వ్యూస్ సంపాదిస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

చదవండి : Viral Video: సీన్ రివర్స్..అంత పెద్ద పాముని గులాబ్ జామ్ లా గుటుక్కున మింగేసిన చేప

ఓ క్రూర జంతువు.. సాధు జంతువుపై దాడి చేస్తుంటే.. మరో క్రూర జంతువు ఆ దాడిని అడ్డుకొని సాధు జంతువును కాపాడింది. ఇక్కడ సాధు జంతువు కప్ప.. వేటాడేందుకు వచ్చింది పాము.. పామును అడ్డుకుంది చిరుత పిల్ల. చిన్న పాములు, కీటకాలు, కప్పలు, ఎలుకలు వంటి వాటిని వేటాడి తింటూ జీవిస్తుంటాయి. ఇదే క్రమంలో ఓ పాము కప్పను వేటాడుతుండగా చిరుత పిల్ల దాన్ని అడ్డుకుంది.

చదవండి : Viral Resign Letter : మహిళా ఉద్యోగి వెరైటీ రిజైన్ లెటర్..బాస్ కి దిమ్మ తిరిగిపోయిందిగా..

చిరుత పిల్లను చూసి భయపడిన పాము వేటను మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయింది. ఇది కెమెరాకు చిక్కింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లక్షల్లో వ్యూస్‌తో దూసుకుపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Explore | Adventure | Travel (@wonderfuldixe)