కాలిఫోర్నియా షాపింగ్‌మాల్‌లో 80మంది డ్యాన్స్ ఎందుకంటే ..

కాలిఫోర్నియా షాపింగ్‌మాల్‌లో 80మంది డ్యాన్స్ ఎందుకంటే ..

ట్రెండ్ మారుతోంది. ఓ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో యూత్ కొత్త స్టైల్ వెదుకుతోంది. కాలిఫోర్నియాలోని ఓ షాపింగ్ మాల్‌లో గుంపుగా 80మంది కస్టమర్లు ఒకేసారి బాలీవుడ్ సాంగ్‌కు కాలు కదిపారు. కంగనా రనౌట్ నటించిన క్వీన్ చిత్రంలోని లండన్ తుమక్‌ద పాటకు చిందులేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. చూసేవాళ్లకి ఇది సరదాకి చేశారనుకుంటున్నారేమో.. కానీ, ఇది చేసింది మాత్రం ఓ సెలబ్రేషన్ కోసం.

 

80మంది కలిపి చేసిన డ్యాన్స్ వీడియోను పోస్టు చేసిన యాజమాన్యం దానికి వెనుక ఉన్న లోతైన నిజాన్ని బయటపెట్టింది. ‘సంవత్సరం పాటు క్యాన్సర్ (లుకేమియా) వ్యాధితో బాధపడి ఆ మహమ్మారి నుంచి బయటపడిన వారు ఇలా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మంచి జోష్ ఉన్న పాట కావాలని బాలీవుడ్ సాంగ్  లండన్ తుమక్‌ద పాటను ఎంచుకున్నారట. 

 

తాము అనుభవించిన చీకటి రోజుల నుంచి ఒకేసారి బయటపడటమే కాకుండా ఇలా బాలీవుడ్ పాటలకు ఎల్లల్లేవని నిరూపించారు. ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేస్తుండటంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.