Viral Pic : ఒక చికెన్ ముక్కకు రూ.3000 బిల్ వేసిన రెస్టారెంట్

ఓ అమ్మాయి రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ ఆర్డర్ దానికి బిల్ కూడా కట్టింది.కానీ ఒకే ఒక్క చికెన్ ముక్కకు రూ.3000 బిల్ వేసేసరికి షాక్ అయిపోయింది.ఆకలిసంగతే మరచిపోయింది.

Viral Pic : ఒక చికెన్ ముక్కకు రూ.3000 బిల్ వేసిన రెస్టారెంట్

Woman Pays Rs 3,000 For A Chicken Dish

Updated On : September 1, 2021 / 6:17 PM IST

Woman Pays Rs 3,000 For a Chicken Dish : లండన్‌కు చెందిన ఓ అమ్మాయి ఆకలి వేసి రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ ఆర్డర్ చేసింది. దానికి 30 పౌండ్లు బిల్ కూడా కట్టింది మన భారత్ కరెన్సీలో రూ.3000లు బిల్ కూడా కట్టింది. ఆర్డర్ చేసిన కాసేటికి సర్వర్ ఓ ప్లేటు పట్టుకొచ్చి ఆ యువతి ముందు పెట్టింది. కానీ ఆ ప్లేట్ లో ఒకే ఒక్క చికెన్ ముక్కఉంది. ఇదేంటీ అని అడిగితే మీరు ఆర్డర్ చేసినదానికి ఇంతే వస్తుందని తాపీగా చెప్పటంతో పాపం ఆ అమ్మాయికి ఆకలి చచ్చిపోయింది. దిమ్మ తిరిగిపోయింది. చేతిలో ఉన్న బిల్ కు తెచ్చిన చికెన్ ముక్క వైపు పిచ్చి చూపులు చూస్తు కూర్చుంది.

లండన్ కు చెందిన రవీన్ అనే ఒక యువతి తన ప్రియుడితో కలిసి ది షార్డ్‌లోని రెస్టారెంట్‌లో డేటింగ్‌కు వెళ్ళింది. ఇది చాలా ఫేమస్ ఏరియా. అక్కడ ఉండే ఓ ఆ రెస్టారెంట్‌లో 30 పౌండ్లు చెల్లించి ఒక డిష్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసినట్లుగా ఫడ్ ప్లేట్ ఆమె ముందు ప్రత్యక్షమైంది. కానీ దాన్ని చూసిన రవీన్ తో పాటు ఆమె లవర్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ప్లేట్ లో ఓ బంగాళాదుంప, చిన్న చికెన్ ముక్క, కొంచెం సాస్ తప్ప ఆ ప్లేట్‌లో ఇంకేం ఐటమ్స్ కనిపించలేదు.

30 పౌండ్స్ చెల్లిస్తే కనీసం చిన్న పిల్లలకు కూడా కడుపునిండని ఐటమ్స్ తెచ్చారేంటని వారిద్దరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె “గాయ్స్, నా 30 పౌండ్ల భోజనాన్ని చూడండి” అంటూ ఆర్డర్ చేసిన డిష్ ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు అందరూ నోరెళ్లబెడుతున్నారు.

బాయ్ ఫ్రెండ్‌తో కలసి ఎంచక్కా మంచి రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ రవీన్ తన డేటింగ్ ను స్వీట్ మెమరీలా గుర్తుంచుకోవాలనుకుంటే ఈ డిష్ మాత్రం ఆమెకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసింది.ప్లేట్ లో వచ్చిన ఒక్క చికెన్ ముక్క చూసేసరికి పాపం ఆ ప్రేమికులకు ఉన్న ఆకలికాస్తా చచ్చిపోయింది. చేసేది లేక డేటింగ్ మూడ్ అంతా పాడైపోయి రెస్టారెంట్ తీరుపై ఆగ్రహం వెళ్లగక్కింది. ఒక చికెన్ ముక్క కొంచెం సాస్ మొహాన కొట్టి 30 పౌండ్లు వసూలు చేశారని ఆమె రెస్టారెంట్ పై సెటైర్లు వేసింది.

రవీన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక చికెన్ ముక్క కోసం 30 పౌండ్లు బిల్లు వేయడం చాలా ఎక్కువగా అని ఒకరు అంటే..బహుశా ఆ చికెన్ ముక్క చాలా నెమ్మదిగా జీర్ణం అవుతుందేమోనని ఇంకో నెటిజన్ సెటైర్ వేస్తున్నారు. ఇలా పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.