Pakistan: పరుగు తీయండ్రోయ్..! పాకిస్థాన్‌లోని లాహోర్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు.. అసలేం జరిగిందంటే..?

భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు, స్థానికంగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Pakistan: పరుగు తీయండ్రోయ్..! పాకిస్థాన్‌లోని లాహోర్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు.. అసలేం జరిగిందంటే..?

Lahore

Updated On : May 8, 2025 / 12:04 PM IST

Pakistan: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. తద్వారా తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. 80మందికిపైగా ఉగ్రవాదులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్ ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది. అయితే, గురువారంసైతం ఆ దేశంలోని లోహార్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీశారు.

Also Read: ఏపీలో పాకిస్థాన్ కాలనీ.. ఇప్పుడు పేరు మార్చి భగీరథ కాలనీ అయింది.. దాని విశేషాలు..

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున లాహోర్ లోని వాల్టన్ ఎయిర్ పోర్టు  సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ఏరియాల్లో ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పేలుళ్ల తరువాత సైరన్లు మోగడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో కరాచీ, లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు బహవల్‌పూర్ ఉగ్రవాద స్థావరం ఎలా మారిందో చూడండి.. వీడియో వైరల్

భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు, స్థానికంగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ పేలుళ్లు వినిపించిన ప్రాంతాల పక్కనే పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఉంది. ఐదు నుంచి ఆరు అడుగుల డ్రోన్ కూలిపోవడం వల్ల ఈ పేలుళ్లు సంభవించి ఉంటాయని స్థానిక అధికారులు తెలిపారు. భారత్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవటంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు.