Scented Spirals: మరీ టూమచ్ బాసూ… ‘దోమల చక్రం’ రూ.6500.. బాక్స్ తో కొంటె రూ. 17,000 అంట
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ సుగంధ ద్రవ్యాల సంస్థ 'డిప్టిక్' విడుదల చేసిన ఈ ఐటెం(Scented Spirals) చూసి భారతీయులు ఆశ్చర్యపోతున్నారు.
luxury brand diptyque scented spirals mosquito coil price india reaction viral
-
దోమల కాయిల్ లగ్జరీ ఉత్పత్తిగా మారింది
-
రూ.6500 ధరపై సోషల్ మీడియా షాక్
-
భారతీయులు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు
Scented Spirals: దోమల సమస్య.. ఇది ప్రతీ మనిషి ఎదుర్కొనే సమస్యనే. వాటి నివారణకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే ఉంటారు. లిక్విడ్స్ అని, కాయిల్స్ అని, దోమలు బ్యాట్స్ అని చాలా రకాలు పరికరాలు వాడుతూనే ఉంటారు. వాటిలో చాలా మంది ఎక్కువగా వాడేది కాయిల్స్. వీటి ధర కూడా రూ.50 రూపాయల వరకు ఉంటుంది. కానీ, అదే ఆకారం, అదే డిజైన్‌ను తీసుకుని ఒక అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వాటిని వేల రూపాయలకు అమ్మితే ఎలా ఉంటుంది? ఏంటి దోమల కాయిల్ వేల రూపాయల అని అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Opendoor Company: భారత్ ఉద్యోగులకు భారీ షాక్.. ఇండియా ఆఫీస్‌కు గుడ్‌బై చెప్పనున్న అమెరికా కంపెనీ
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ సుగంధ ద్రవ్యాల సంస్థ ‘డిప్టిక్’ విడుదల చేసిన ఈ ఐటెం చూసి భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. డిప్టీక్ తన సమ్మర్ లిమిటెడ్ కలెక్షన్లో భాగంగా “సెంటెడ్ స్పైరల్స్(Scented Spirals)” పేరుతో ఒక ప్రత్యేక ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది చూడటానికి మన దేశంలో విరివిగా ఉపయోగించే దోమల కాయిల్‌లా ఉండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. లెమన్‌గ్రాస్ (సిట్రోనెల్లా) సువాసనతో తయారైన ఈ స్పైరల్స్ ధర 68 అమెరికన్ డాలర్లు, అంటే సుమారు రూ.6,500. అంతేకాదు, దీనికి ప్రత్యేక హోల్డర్‌ను కలిపి కొనుగోలు చేస్తే ధర ఏకంగా రూ17,000 దాటుతుంది. కంపెనీ ప్రకారం ఇవి ఇంటి బయట ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించే సుగంధాన్ని వెదజల్లుతాయి.
అయితే భారతీయ నెటిజన్లు మాత్రం దీనిని సాధారణ దోమల కాయిల్కే లగ్జరీ ట్యాగ్ పెట్టి అమ్ముతున్నారని సెటైర్లు వేస్తున్నారు. “మన దోమలే దీన్ని అంగీకరించవు” అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. భారతీయ సంప్రదాయ వస్తువులు, డిజైన్లు, కళలను అంతర్జాతీయ బ్రాండ్లు తరచుగా ప్రేరణగా తీసుకుంటున్నప్పటికీ, వాటిని భారీ ధరలకు విక్రయించడం మరోసారి చర్చకు కారణమైంది. ఈ ఘటనతో ‘సాధారణ వస్తువును లగ్జరీగా మార్చితే ధర ఎంత పెరుగుతుందో’ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
