Malaysia : భర్త మాట భార్య వినాలంటే కొడితేనే దారికొస్తుంది : మహిళా మంత్రి వ్యాఖ్యలు

భర్త మాట భార్య వినాలంటే కొట్టాలని కొన్ని రోజులపాటు ఆమెకు దూరంగా ఉంటే భర్త అంటే ఏంటో తెలిసి వస్తుందని అప్పుడే దారికొస్తుంది అంటూ వ్యాఖ్యానించారు ఓ మహిళా మంత్రి.

Malaysia : భర్త మాట భార్య వినాలంటే కొడితేనే దారికొస్తుంది : మహిళా మంత్రి వ్యాఖ్యలు

Dont Sleep With Your Wife For Three Days Beat Her Too

Updated On : February 18, 2022 / 12:14 PM IST

dont sleep with your wife for three days beat her too : భార్య భర్త మాట వినాలంటే బాగా తన్నాలని..అలా చేస్తేనే భార్య దారికొస్తుందని..భర్తలకు గొప్ప సలహాలు చెప్పారు ఓ మంత్రిగారు.పైగా ఆ మంత్రి ఓ మహిళే కావటం మరో విశేషం. మొండిగా ఉంటే ఏం చేయాలో మ‌లేషియా మంత్రి సితి జైలా మ‌హ్మ‌ద్ యూస‌ఫ్‌ పలు సలహాలు కూడా చెప్పారు. భార్య మొండిగా భర్త చెప్పిన మాట వినకుండా ఉంటే..ఈ మహిళా మంత్రిగా ఏం చెప్పారంటే..‘భార్య భర్త మాటకు ఎదురుచెప్పకుండా ఉండాలంటే తో ఆమెతో కలిసి మూడు రోజుల పాటు పడుకోవద్దు..తిట్టండి…అప్పటికీ మాట వినకపోతే కొట్టండి’అంటూ చెప్పారు.

Also read :Singapore PM fLee Hsien :నెహ్రూపై సింగపూర్‌ ప్రధాని ప్రశంసలు..భారత ఎంపీల నేరచరిత్రలపై..సంచలన వ్యాఖ్యలు

మ‌లేషియా మంత్రి సితి జైలా మ‌హ్మ‌ద్ యూస‌ఫ్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లో వార్త‌ల్లోకెక్కారు. భార్య గ‌న‌క మొండిగా, అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ఆమెపై చేయి చేసుకోవాల‌ని..గట్టిగా కొట్టాలని చెప్పారు. ఇలా చేస్తేనే భార్య క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటుంద‌ని..దారికొస్తుందని సలహాలిచ్చారు. ఇంకా..భార్య గ‌న‌క భ‌ర్త స‌ల‌హాల‌ను పాటించ‌కపోతే..మూడు రాత్రులు ఆమెతో కలిసి పడుకోవద్దని..విడిగా పడుకోవాలని కూడా చెప్పారు. అప్పటికీ దారికి రాకపోతే కొడుతూ.. విరుచుకుప‌డాల‌ని సలహాలు చెప్పారు. ఇలా చేస్తేనే భ‌ర్త అంటే ఏమిటో భార్యకు తెలిసొస్తుంద‌న్నారు.

మహిళలు, కుటుంబం..కమ్యూనిటీ డెవలప్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ సిటి జైలా మహ్మద్ యూసోఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భర్త ఎంత కఠినంగా ఉంటే భార్య అంతలా చెప్పిన మాట వింటుందని అన్నారు. పురుషులు తమ భార్యలను కొట్టమని ప్రోత్సహించడం ద్వారా గృహ హింసను మంత్రి పోత్సహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

Also read : MP : అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి పనులు చేయించాలి : మంత్రి వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం

‘మదర్స్ టిప్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రెండు నిమిషాల వీడియోలో వివాదంగా మారింది. మూడు రోజులు భర్తలు దూరంగా పడుకుంటే భార్యకు భర్త అంటే ఏంటో తెలిసొస్తుందని..ఆ తరువాత భర్తలు శారీరక స్పర్శ ద్వారా భార్యలను దారికి తెచ్చుకోవాలని మంత్రి సితి జైలా వీడియోలో పేర్కొన్నారు.

అలాగే భార్యలకు తమ భర్తల మనస్సులను గెలుచుకోవాలంటే..భార్యలు ఏదైనా చెప్పాల‌ని అనుకున్నారు..ఏదైనా చేయాలని అనుకున్నా భర్తల అనుమతి తీసుకున్నాకే చేయాలని తెలిపారు.అలాగే భర్తలు అన్నం తినే సమయంలో గానీ, ప‌డుకున్న స‌మ‌యంలో గానీ, ఇత‌ర స‌మ‌యాల్లో గానీ భ‌ర్త అనుమ‌తి తీసుకొని మాట్లాడితే.. వారి మనసులో గెలుచుకోవచ్చని మ‌లేషియా మంత్రి సితిజైలా మ‌హ్మ‌ద్ యూసుఫ్ అన్నారు.

Also read : Minister Kapil Patil: మటన్ రూ.700,పిజ్జా కోసం రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటారు : కేంద్ర మంత్రి

ఈ మహిళా మంత్రిగారి వ్యాఖ్యలపై ప్ర‌తిప‌క్షాల‌తో స‌హా… సామాన్య ప్ర‌జ‌లు కూడా తీవ్రంగా మండిప‌డుతున్నారు. వెంట‌నే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్య‌ల ద్వారా గృహ హింస‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడే కాదు గ‌తంలోనూ మంత్రి ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు.