Minister Kapil Patil: మటన్ రూ.700,పిజ్జా కోసం రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటారు : కేంద్ర మంత్రి

మోడీ ప్రధాని అయ్యింది ధరలు తగ్గించటానికి కాదని..ప్రజలు మటన్ రూ.700,పిజ్జా రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటూ విమర్శలు చేస్తారంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి.

Minister Kapil Patil: మటన్ రూ.700,పిజ్జా కోసం రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటారు : కేంద్ర మంత్రి

Modi Did Not Become Pm To Bring Down Onion Potato Prices (1)

Modi did not become PM to bring down onion potato prices : దేశంలో నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని ప్రజలు అనకూడదట. టమాటాలు, ఉల్లిగడ్డలు ధరలు ఎక్కువగా ఉన్నాయని అనకూడదట. వందల రూపాయలు చెల్లించి మటన్, పిజ్జాలు తింటారు గానీ కూరగాయలు రూ.40 దాటితే ధరలు పెరిగిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతుంటారని ప్రధాని మోడీపై విమర్శలు చేస్తుంటారని..మోదీ ఉన్నది ఉల్లిపాయలు, బంగాళా దుంపల ధరలు తగ్గించేందుకు కాదు అంటూ అసహనం వ్యక్తం చేశారు బీజేపీ మంత్రిగారు. మటన్ కోసం రూ.700 ఖర్చు పెడతారు. పిజ్జా కోసం రూ.500ల నుంచి రూ.600లు ఖర్చు పెడతారు కానీ..ఉల్లిగడ్డలు.. టమాటాకు రూ.40 చెల్లించటానికి తెగ కష్టం అంటున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ సహాయ మంత్రి కపిల్ వ్యాఖ్యానించారు.

Also Read : బీజేపీ నేత వ్యాఖ్యలు : ఫ్లూట్ ఊదితే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయ్

మోడీ ప్రధాని అయ్యింది ధరలు తగ్గించటానికి కాదని..ధరల పెరుగుదలకు అసలు కారణం తెలుసుకోవాలంటూ సూచలను చేశారు సదరు మంత్రిగారు. ప్రధానిగా ఉన్న మోడీ..హోంమంత్రిగా మంత్రిగా ఉన్న అమిత్ షాలు దేశం కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది..అటువంటిది ధరలు పెరిగాయనివారిపై విమర్శలు చేయటం మానుకోవాలంటూ ఉపదేశించారు మంత్రి కపిల్ పాటిల్.

మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కపిల్ పాటిల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఉన్నది ఉల్లిపాయలు, బంగాళా దుంపల ధరలు తగ్గించేందుకు కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగాయని మోడీమీద విమర్శలు చేస్తుంటారు…మరోవైపు పిజ్జా, మటన్ ల కోసం మాత్రం వందల రూపాయలు ఖర్చు చేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు.

Also Read : MP : అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి పనులు చేయించాలి : మంత్రి వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం

నిత్యావసరాల ధరలు పెరగటం ఎవరు మాత్రం సమర్థిస్తారు? అంటూ ప్రశ్నించారు. కానీ ‘‘ప్రజలు మటన్ కోసం రూ.700, పిజ్జా కోసం రూ.500-600 ఖర్చు చేస్తున్నారు. కానీ..ఉల్లిగడ్డలకు రూ.10, టమాటోకు రూ.40 ఖర్చు పెట్టడానికి మాత్రం అవి ధరలు పెరిగిపోయాయంటూ గగ్గోలు పెడుతుంటారని విమర్శించారు. సరుకుల ధరలు పెరటాన్ని ఎవ్వరు సమర్థించారు. కానీ..మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల ధరలు తగ్గించటానికి కాదని తెలుసుకోవాలన్నారు. ధరల పెరుగుదల వెనుక కారణం ఏమిటో కూడా ప్రజలు తెలుసుకోవాలని ఆ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటూ సూచనలు చేశారు.ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణం తెలుసుకుంటే ప్రధానిని విమర్శించరు అని అన్నారు.

Also Read : Muslim Sculptors : ముస్లిం శిల్పులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కేవలం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే దేశం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలరు. ప్రధాని మోదీయే దేశాన్ని పాలించాలి అని ఆకాంక్షించిన మంత్రి కపిల్ మరిన్ని వ్యాఖ్యలు చేస్తు..ఆర్టికల్ 370, 35ను రద్దు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సైతం 2024లోపే భారత్ చేతికి వచ్చి తీరుతుందని నేను భావిస్తున్నాను’’అంటూ మంత్రి పాటిల్ వ్యాఖ్యానించారు.

Also Read :  Uma Bharathi : మా చెప్పులు మోయడానికే అధికారులు పనికొస్తారు: ఉమాభారతి