లైవ్ లో నగ్నంగా, వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ అధ్యక్షుడికి వింత అనుభవం
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉద్యోగులు

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉద్యోగులు
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక నేతలు కూడా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా అయితే కరోనా భయం ఉండదని నమ్మకం. ఇది బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే, వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అప్పుడప్పుడు పలు పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఘటనలు నవ్వులు పూయిస్తున్నాయి. కొన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం ఘోరమైన పొరపాటు చోటు చేసుకుంది. అదిప్పుడు వైరల్ గా మారింది.
లైవ్ లో బట్టలు లేకుండా కనిపించిన బిజినెస్ మ్యాన్:
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు వింత అనుభవం ఎదురైంది. దేశంలో కరోనా లాక్‌డౌన్ పరిస్థితులపై జైర్ బోల్సోనారో మంత్రులు, అధికారులతో జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు పాలో స్కాఫ్, పరిశ్రమల మంత్రి, మరికొందరు ముఖ్యమైన బిజినెస్ మెన్లు పాల్గొన్నారు. అయితే సమావేశం జరుగుతున్న మధ్యలో ఒక వ్యక్తి బట్టలు లేకుండా నగ్నంగా కనిపించాడు. దీంతో అధ్యక్షుడు సహా అంతా కంగుతిన్నారు. కాసేపు వారికి నోట మాట రాలేదు.
బట్టలు లేని వ్యక్తిని చూసి కంగుతిన్న అధ్యక్షుడు:
పరిశ్రమల మంత్రి పాలో గిడ్డెస్ మాట్లాడుతున్న సమయంలో బోల్సోనారో ఆ దృశ్యాన్ని గమనించారు. పాలో.. అక్కడ మూలకు ఉన్న బాక్సులో కనిపిస్తున్న వ్యక్తి సరిగ్గానే ఉన్నాడా? అని ఆయనను ప్రశ్నించారు. దీనికి వెంటనే పాలో కూడా స్పందించారు. ‘అవును, అక్కడ ఓ వ్యక్తి బట్టలు లేకుండా స్నానం చేస్తున్నాడు. ఈ సమావేశంలో వాడీవేడి చర్చ జరుగుతున్న క్రమంలో అతడు చల్లబడేందుకు ఇలా చన్నీటి స్నానం చేస్తున్నాడు’ అని అధ్యక్షుడికి సమాధానం చెబుతూ చమత్కరించారు పాలో. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు మళ్లీ స్పందించారు. ”దురదృష్టవశాత్తు మేము చూశాము, ఇది భయంకరమైన చిత్రం, కానీ మేము చూశాము” అని కామెడీ చేశారు.
కెమెరాను ఆపేయడం మర్చిపోయాడు, అదే కొంపముంచింది:
అధ్యక్షుడితో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ లో ఓ వ్యక్తి ఇలా నగ్నంగా లైవ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే, ఈ కాన్ఫరెన్స్ కు హాజరైన వారిలో అతడు కూడా ఒకడు. అతడు ఓ బిజినెస్ మ్యాన్. కాగా, కాన్ఫరెన్స్ తర్వాత ఆ వ్యక్తి తన కెమెరాను ఆపేయడం మర్చిపోయి అలానే స్నానం చేయడానికి వెళ్లాడు. సమావేశంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు తనను చూస్తున్నారనే విషయం పాపం అతనికి తెలియదు.
వైరల్ గా మారిన నూడ్ వీడియో:
వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ దేశ అధ్యక్షుడి సమావేశంలో ఇలా జరగడం ఇప్పుడా దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పొరపాట్లు జరగడం సాధారణమే అని కొందరు అంటే, మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఇంకొందరు మండిపడ్డారు. ఒక వేళ ఆ వ్యక్తి అలానే బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉంటే.. పరిస్థితి ఏంటిని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. మొత్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతపని చేసిందిరా నాయనా అని నవ్వుకుంటున్నారు.
Read: మాస్క్ పెట్టుకోకపోతే రూ.12.25లక్షలు జరిమానా..!జైలు కూడా : సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్