Pakistan: పాక్‭లో అత్యంత దుర్మార్గం… పిల్లల్ని చంపి, మాంసాన్ని వండుకుని తిన్నాడు.. దర్గాలో కూడా పంచి పెట్టాడు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ దుర్మార్గుడు వండిన మాంసాన్ని తిని, మిగిలిపోయినది ముజఫర్‌గఢ్‌లోని స్థానిక దర్గాలో ప్రజలకు పంచిపెట్టాడు

Pakistan: పాక్‭లో అత్యంత దుర్మార్గం… పిల్లల్ని చంపి, మాంసాన్ని వండుకుని తిన్నాడు.. దర్గాలో కూడా పంచి పెట్టాడు

Updated On : December 15, 2023 / 3:43 PM IST

కొంతమంది చిన్నారులను చంపడమే కాకుండా వారి మాంసాన్ని కూడా తింటున్నాడు పాకిస్తాన్ కు చెందిన ఓ దుర్మార్గుడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ముజఫర్‌గఢ్‌లో ఉంటున్న అతడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితమే ఈ వ్యక్తి ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశాడు. వీరిలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కిరాతకంగా తీసి, ఆ పిల్లల మాంసాన్ని వండుకుని తిన్నాడని ఆరోపించారు.

అయితే, పోలీసుల చర్యతో అలీ హసన్ అనే 7 ఏళ్ల బాలుడు రక్షించబడ్డాడు. చనిపోయిన ఇద్దరి పిల్లల వయస్సు కూడా చాలా చిన్నది. ఆ దుర్మార్గుడు మొదట అబ్దుల్లాతో సహా అతని సోదరి హఫ్సాను చంపి, ఆపై వారి మాంసాన్ని వండుకుని తిన్నాడని పోలీసు అధికారి అలీ హసన్ చెప్పారు. మరణించిన అబ్దుల్లాకు మూడేళ్లు కాగా, అతని సోదరి వయసు ఏడాదిన్నర. ఇంత చిన్న పిల్లలను చంపడానికి గల కారణం ఏంటని మాత్రం ఇంకా తేలలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ దుర్మార్గుడు వండిన మాంసాన్ని తిని, మిగిలిపోయినది ముజఫర్‌గఢ్‌లోని స్థానిక దర్గాలో ప్రజలకు పంచిపెట్టాడు. హఫ్సా, అబ్దుల్లా ఎలా హత్యకు గురయ్యారనేది ఇంకా నిర్ధారించలేదు. వాస్తవానికి నిందితుడికి ఇంకా స్పృహ రాలేదు. స్పృహలోకి వచ్చిన తర్వాతే ఈ కేసుకు సంబంధించిన ఇతర వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. నిందితులపై హత్య, ఉగ్రవాద సెక్షన్లు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి పిల్లల తండ్రి ఫయాజ్‌ డిమాండ్‌ చేశారు.