Viral Video: బాబోయ్.. మరీ ఇంత ధైర్యమా.. మంచంపై అనకొండతో..! వీడియో వైరల్

అమెరికన్ వ్యక్తి పెద్ద అనకొండ పక్కనే మంచంపై పడుకొని ఉన్నాడు. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ..

Viral Video: బాబోయ్.. మరీ ఇంత ధైర్యమా.. మంచంపై అనకొండతో..! వీడియో వైరల్

Man with anaconda

Updated On : December 9, 2024 / 2:38 PM IST

Viral Video: ప్రతిరోజూ సోషల్ మీడియాలో షాకింగ్ కు గురిచేసే, భయం పుట్టించే వీడియోలు చూస్తూనే ఉంటాం. తాజాగా. సోషల్ మీడియాలో వణుకు పుట్టించే వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అమెరికన్ వ్యక్తి పెద్ద అనకొండ పక్కనే మంచంపై పడుకొని ఉన్నాడు. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పుస్తకం చదువుతున్నాడు. అతని తల వద్ద అనకొండ నిద్రిస్తుండగా.. అతడి కాళ్ల వద్ద పెంపుడు కుక్క విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాబోయ్.. అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  IND vs AUS : రెండో టెస్టులో ఘోర ఓట‌మి.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పై టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి కామెంట్స్‌..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భయంకరమైన వీడియోను మైక్ హోల్‌స్టన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ’ఇది పిచ్చి ప్రవర్తన’ అని పేర్కొనగా.. మరొకరు ‘ఇది చాలా ప్రమాదకరమైంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను వీక్షించిన అధిక మంది వీడియోలోని వ్యక్తి ప్రవర్తన పట్ల షాక్ కు గురవుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Mike Holston (@therealtarzann)