IND vs AUS : రెండో టెస్టులో ఘోర ఓటమి.. కెప్టెన్ రోహిత్ శర్మ పై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్..
రోహిత్ శర్మ నాయకత్వం పై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Ravi Shastri Delivers Blunt Verdict On Rohit Captaincy Against Australia
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుడిగా, ఆటగాడిగా అతడు పూర్తిగా విఫలం అయ్యాడని అంటున్నారు. టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం రోహిత్ శర్మ నాయకత్వం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
రెండో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీని చూస్తే ప్రత్యర్థి జట్టుకు పూర్తిగా లొంగిపోయినట్లుగా కనిపించిందని విమర్శించాడు. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లో హిట్‌మ్యాన్ దూకుడు ప్రదర్శించాలని, భారత జట్టు కోలుకుంటుందనే ధీమాను శాస్త్రి వ్యక్తం చేశాడు.
PV Sindhu Marriage: కాబోయే భర్తతో కలిసి సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లిన పీవీ సింధూ
రోహిత్ శర్మ తిరిగి ఓపెనర్‌గానే బరిలోకి దిగాలని సూచించాడు. ఎందుకంటే టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడతాడని చెప్పుకొచ్చాడు ఈ సిరీస్‌లో మళ్లీ పుంజుకుంటామనే నమ్మకంతో ఉండాలి. ద్వైపాక్షిక సిరీసుల్లో ప్రత్యర్థులకు వెంటనే సమాధానం ఇవ్వడాన్ని చూశాం. ఓ మ్యాచ్‌లో ఓడితే వెంటనే మరో మ్యాచులో గెలుస్తారు. అదే నమ్మకం జట్టులో ఉండాలి అని రవిశాస్త్రి అన్నాడు.
ఓటమి నుంచి మరిన్ని పాఠాలు నేర్చుకొని మూడో టెస్టుకు సిద్ధం కావాలన్నాడు. ఇక్కడ ఆస్ట్రేలియా జట్టును చూసి నేర్చుకోవాలన్నాడు. తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఓడిపోయింది. అయితే.. వెంటనే వారు తమ బలహీనతలపై దృష్టి పెట్టి రెండో టెస్టులో విజయాన్ని అందుకున్నారన్నాడు. ఇక రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లోనే ఆడించాలన్నాడు.
మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే మిగిలిన మూడు టెస్టు మ్యాచుల్లో భారత్ గెలవాల్సిన అవసరం ఉంది. బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.