AUS vs IND : ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. షమీ గురించి ప్రస్తావన..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తదుపరి మ్యాచ్ లకోసం ఆస్ట్రేలియా టూర్ కు వచ్చే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.

AUS vs IND : ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. షమీ గురించి ప్రస్తావన..

Rohit Sharma

Updated On : December 8, 2024 / 1:47 PM IST

Rohit Sharma : ఆడిలైడ్ ఓవల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ జట్టు ఘోర పరాజయం పాలైంది. పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. తద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు వెళ్లే మార్గాలను క్లిష్టతరం చేసుకుంది. రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏఒక్కరూ క్రీజులో పాతుకుపోయి భారీ పరుగులు సాధించేందుకు ప్రయత్నం చేయకపోవటం గమనార్హం. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సింగిల్ డిజిట్ స్కోర్ దాటలేక పోయారు. అయితే, మ్యాచ్ అనంతరం రెండో టెస్టులో ఘోర పరాజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. భారత్ ఓటమికి కారణాలను వివరించారు.

Also Read: WTC Table: అయ్యో.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్ ప్లేస్.. దక్షిణాఫ్రికా నయం

భారత్ జట్టు ఓటమి ప్రధాన కారణం మేము బ్యాటింగ్ లో వైఫల్యం కావటమేనని అన్నారు. రెండు జట్ల మధ్య అతిపెద్ద తేడా బ్యాటింగ్. మేము ఆస్ట్రేలియా ముందు భారీ స్కోర్ ఉంచేందుకు చేయాల్సిన బ్యాటింగ్ చేయడంలో విఫలం అయ్యాం. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే ఎక్కువ పరుగులు సాధించాలని తెలుసు.. కానీ, మేము రెండు ఇన్నింగ్స్ లలోనూ ఆ విషయంలో విఫలమయ్యాం అని రోహిత్ అన్నారు. విదేశాల్లో పరిస్థితులు అనుకూలిస్తే పెర్త్ టెస్టు మాదిరిగా పరుగులు సాధిస్తాం. ప్రతి బ్యాటర్ భారీ స్కోర్ సాధించాలనే బరిలోకి దిగుతారు. కానీ, కొన్నిసార్లు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాదు. బ్రిస్బేన్ లో జరిగే మ్యాచ్ లో మరింత మెరుగ్గా రాణించడంపై దృష్టిపెడతామని రోహిత్ శర్మ అన్నారు.

Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో పింక్‌బాల్‌ టెస్టు.. భారత్ జట్టు ఘోర పరాజయం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తదుపరి మ్యాచ్ లకోసం ఆస్ట్రేలియా టూర్ కు వచ్చే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. షమీ కోసం కచ్చితంగా జట్టు తలుపులు తెరిచే ఉంటాయి. ప్రస్తుతం అతను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు. అయితే, ఇటీవల మ్యాచ్ సందర్భంగా అతడి మోకాలు మళ్లీ వాచింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం అతని రాకను అడ్డుకుంటుంది. అతడిని ఒత్తిడికి గురిచేయడం సరికాదు. అతడి విషయంలో అప్రమత్తంగా ఉంటాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని రోహిత్ చెప్పాడు.