PV Sindhu Marriage: కాబోయే భర్తతో కలిసి సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లిన పీవీ సింధూ

ఆదివారం కాబోయే భర్త వెంకట దత్త సాయితో కలిసి పీవీ సింధూ ముంబయిలోని భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లారు.

PV Sindhu Marriage: కాబోయే భర్తతో కలిసి సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లిన పీవీ సింధూ

PV Sindhu

Updated On : December 9, 2024 / 12:35 PM IST

PV Sindhu Marriage Update : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకట్ దత్త సాయిని ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈనెల 22న ఉదయ్ పూర్ లోని లేక్స్ నగరంలో వీరి వివాహం జరగనుంది. డిసెంబర్ 20 నుంచి వివాహ వేడుకలు మొదలు కానున్నాయి. ఈనెల 24న హైదరాబాద్ లో రెండు కుటుంబాలు కలిసి రెసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పలు రంగాల్లోని ప్రముఖులను కలిసి తమ పెళ్లికి రావాలని పీవీ సింధూ శుభలేఖలు అందిస్తున్నారు. తాజాగా తన భర్తతో కలిసి పీవీ సింధూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లారు.

Also Read: RRR Documentary : వావ్.. RRR మేకింగ్ పై డాక్యుమెంటరీ.. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ వెయిటింగ్..

ఆదివారం కాబోయే భర్త వెంకట దత్త సాయితో కలిసి పీవీ సింధూ ముంబయిలోని భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లారు. సచిన్ ను కలిసి తమ పెళ్లికి రావాలని కోరుతూ పెళ్లి శుభలేఖను పీవీ సింధూ, వెంకట దత్త సాయిలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సచిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘త్వరలోనే వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న జంటకు శుభాకాంక్షలు. పెళ్లికి రావాలని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇద్దరూ జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. సచిన్ ట్వీట్ లో పేర్కొన్నారు.