Cuts off Legs: ఇన్సూరెన్స్ డబ్బులు రూ.24కోట్ల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిరాయి హంతకులతో హత్యలు చేయించుకోవడం పక్కకుబెడితే బతికి ఉండగానే కాళ్లు నరికేసుకున్నాడు.

Cuts off Legs: ఇన్సూరెన్స్ డబ్బులు రూ.24కోట్ల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి

Insurance Money

Updated On : November 12, 2021 / 8:29 PM IST

Cuts off Legs: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిరాయి హంతకులతో హత్యలు చేయించుకోవడం పక్కకుబెడితే బతికి ఉండగానే కాళ్లు నరికేసుకున్నాడు. సుమారు 14 బీమా పాలసీలను చెల్లించిన వ్యక్తి.. వాటిని క్లైయిమ్ చేసుకునేందుకు ఈ పనికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ వేసి రూ.24కోట్ల డబ్బు దక్కించుకోవాలనుకున్నాడు. 54ఏళ్ల సెందర్ అనే హంగేరీకి చెందిన వ్యక్తి ఇన్సురెన్స్‌ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకున్నాడు.

2014లో జరిగిన ఈ ఘటనలో తన రెండు కాళ్లు కోల్పోగా అప్పటి నుంచి కృత్రిమ అవయవాలతో వీల్‌చైర్ సపోర్టు లేకుండా బతకలేడు. ఆ ఘటన తర్వాత బీమా డబ్బు కోసం ఇన్సూరెన్స్ కంపెనీలను సంప్రదించాడు. ప్లాన్ ప్రకారమే ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో ఎంక్వైరీ చేశారు.

కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. అన్నిటి నుంచే ఒకేసారి పాలసీలు తీసుకోవడంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి క్లెయిమ్ ను వాయిదా వేశాయి. డబ్బుల కోసం ఆ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. కోర్టు విచారణలో నిజం తెలిసిపోయింది.

…………………………….. : ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన

ముందుగా గ్లాస్ మీద పడటంతో జారి రైలు పట్టాల మీద పడిపోయాయని అదే సమయానికి రైలు కాళ్ల మీద నుంచి వెళ్లిపోయిందంటూ చెప్పాడు. అవేవీ రుజువు కాకపోగా పరువు కూడా పోయింది. కోర్టులో నిజాన్ని ఒప్పుకోవడంతో అధికారికంగానే క్లెయిమ్స్‌కు నో చెప్పేశాయి ఇన్సూరెన్స్ సంస్థలు.