Man Eat Wife Brain : మెక్సికోలో దారుణం.. భార్యను హత్య చేసి ఆమె మెదడును తిన్న భర్త

భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాడు. ఆ తర్వాత సవతి కుమార్తెకు ఫోన్ చేశాడు. వారి తల్లిని చంపి మృతదేహాన్ని బ్యాగులో ఉంచానని, వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు.

Man Eat Wife Brain : మెక్సికోలో దారుణం.. భార్యను హత్య చేసి ఆమె మెదడును తిన్న భర్త

man eat wife brain

Updated On : July 9, 2023 / 12:41 AM IST

Mexico Man Kill Wife : మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆపై ఆమె మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు. అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు. ఈ ఘోరమైన ఘటన ప్యూబ్లోలో జరిగింది. వివరాళ్లోకి వెళ్తే..అల్వార్ అనే 32 ఏళ్ల వ్యక్తి బిల్డర్. అల్వార్ 38 ఏళ్ల మరియా మోంట్ సెరాట్ ను గతేడాది పెళ్లి చేసుకున్నాడు.

ఆమెకు అప్పటికే 12 నుంచి 23 ఏళ్ల వయసు ఉన్న ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా, జూన్ 29న అల్వారో దారుణానికి ఒడిగట్టాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కులుగా నరికేశాడు. భార్య మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు.
అంతేకాకుండా ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు.

Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త

భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాడు. ఆ తర్వాత సవతి కుమార్తెకు ఫోన్ చేశాడు. వారి తల్లిని చంపి మృతదేహాన్ని బ్యాగులో ఉంచానని, వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి అల్వారోను అరెస్టు చేశారు. దెయ్యం ఆదేశించడంతో ఈ నేరం చేసినట్లు అతడు పోలీసులకు తెలిపాడు.

అలాగే భార్యను హత్య చేసిన నిందితుడి గదిలో చేతబడి ఆనవాళ్లు, బలిపీఠం వంటివి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అయితే, డ్రగ్స్ తీసుకునే అలవాటున్న అల్వారో సవతి కుమార్తెలను కూడా మానిసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించారు. అతడు మానసిక రోగి కావొచ్చని, అందుకే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని ఆమె పేర్కొన్నారు.