Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త

మంచింగ్ కు ఆమ్లెట్ వేయలేదనే కారణంతో భార్యనే చంపేశాడో భర్త. బీహార్ సహియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెలాహీ జయ్ రామ్ గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త

Murder For Omelette

Murder For Omelette : బీహార్ లో దారుణం జరిగింది. ఓ చిన్న కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. అంతేకాదు సూసైడ్ గా చిత్రీకరించాలని చూశాడు. వివరాల్లోకి వెళితే.. మంచింగ్ కు ఆమ్లెట్ వేయలేదనే కారణంతో భార్యనే చంపేశాడో భర్త. బీహార్ సహియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెలాహీ జయ్ రామ్ గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్ అనే వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే గురువారం కూడా పీకల దాకా తాగి ఇంటికి వెళ్లాడు.

Omelette

Omelette

వెళ్తూ వెళ్తూ మంచింగ్ కోసం ఇంటికి కోడిగుడ్లు తీసుకెళ్లాడు. తనకు ఆమ్లెట్ వేసివ్వాలని భార్యను కోరాడు. అయితే, గురువారం కదా.. ఆమ్లెట్ వద్దు అని భార్య చెప్పింది. ఆమ్లెట్ తినొద్దని భర్తను వారించింది. దీంతో భర్తకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో గొంతు నులిమి ఆమెని చంపేశాడు. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశాడు.

Delhi Girl Murder : భార్య బంధువుల ఇంటికి-ప్రియురాలు పడక గదికి-హత్య చేసిన ప్రియుడు

నిందితుడు అజిత్ సింగ్ తండ్రి రామ్ వినయ్ సింగ్ రిటైర్డ్ ఎస్ఐ. రామ్ వినయ్ సింగ్ స్టేట్ మెంట్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు అజిత్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

”నా కొడుకు బాగా తాగి ఉన్నాడు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తన వెంటన కోడి గుడ్లు కూడా తెచ్చుకున్నాడు. తనకు ఆమ్లెట్ వేసివ్వాలని తన భార్య నీతూ సింగ్(30)ను అజిత్ అడిగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. గురువారం కావడంతో కిచెన్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. భార్య అలా చెప్పడంతో వివాదానికి దారితీసింది. మద్యానికి బానిసగా మారిన భర్త తీరుతో భార్య విసిగిపోయింది. మద్యం తాగొద్దని అనేకసార్లు భర్తకు చెప్పింది. ఈ విషయమై తరుచూ ఇద్దరూ గొడవపడేవారు.

Omelette Kill

Omelette Kill

గురువారం రాత్రి కూడా అలానే గొడవ జరిగింది. అజిత్ కి చాలా కోపం వచ్చింది. బెడ్రూమ్ లో భార్యను దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కి ఉరేశాడు. కాసేపటి తర్వాత నా కోడలి ఏడుపు ఆగింది. ఇద్దరూ సైలెంట్ అయిపోయారని నేను అనుకున్నాను. అయితే కాసేపటి తర్వాత నా కొడుకు అజిత్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నాకు అనుమానం వచ్చింది. బెడ్రూమ్ లోకి వెళ్లి చూశాను. నా కోడలు సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడం చూసి షాక్ కి గురయ్యా” అని అజిత్ సింగ్ వాళ్ల నాన్న వినయ్ సింగ్ పోలీసులతో జరిగిందంతా చెప్పాడు.

Prostitution : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్

మృతురాలి మామ వినయ్ సింగ్ స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడు అజిత్ సింగ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.