తనని తానే పెళ్లాడిన బ్రెజిల్ యువకుడు.. ఎందుకో తెలుసా..!

Man marries himself in brazil : ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణమైపోయ్యాయి. పెద్దలు అంగీకరించకపోయినా పారిపోయి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. కొన్ని ప్రేమ పెళ్లిళు అయితే ఏదో ఒక చిన్నకారణంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయినవారు చాలానే ఉన్నాయి. మరికొంతమంది బ్రేకప్ చేసుకుని విడిపోయి అది తట్టుకోలేకి చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోతారు. ఇంకొందరైతే, పోతే పోయిందీ.. అని లైట్ తీసుకుని తమదారి తాము చూసుకుంటున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం చాలా విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పిందని తనని తానే పెళ్లాడాడు బ్రెజిల్ యువకుడు. మరి ఆ విచిత్ర యువకుడి వింత విశేషాలేంటూ తెలుసుకుందాం…!
బ్రెజిల్‌కు చెందిన 33ఏళ్ల డియాగో రాబెలో, విటర్ బ్యూనోలు ఇద్దరూ చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికి గతేడాది నవంబరులో నిశ్చితార్థం జరిగింది. ఊరంతా జాతరలా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. గత నెల సెప్టెంబరులో వీరు పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే వీరిద్దరి మధ్య గొడవలు మెుదలయ్యాయి. అవి తీవ్ర స్థాయి కావడంతో, మనసు విరిగిపోయిన విటర్ జులైలో డియాగోకు బ్రేకప్ చెప్పేసింది. అయినా సరే డియాగో మనసులో నుంచి పెళ్లి ఆలోచన మాత్రం పోలేదు.
ప్రియురాలి బ్రేకప్‌తో డియాగో వివాహం ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ డియాగో మాత్రం అలా అనుకోలేదు. ‘ఆమె పోతే పోయింది… నన్ను నేనే పెళ్లాడతా. నన్ను నాకెంటే గొప్పగా ప్రేమించేవాడు ఎవడున్నాడు’ అని మనసులో అనుకున్నాడు. దీంతో అనుకున్నదే తడవుగా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. అనుకున్న దాని కన్నా నెల ఆలస్యంగానే అక్టోబర్ 17, 2020 న డియాగో పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.
అతడి ఆహ్వానం మేరకు బంధువులు, స్నేహితులు బాహియాలోని ఇటాకేర్ ని రిసార్ట్ కు వచ్చారు. పెళ్లికూతురు మాత్రం రాలేదు. అక్కడున్న వారందరికీ తెలుసు ఆమె రాదని, అంతలోనే డియాగో తన కుడి చేతికి రింగు తొడుక్కున్నాడు. తనని తానే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డియాగో స్పందిస్తూ… ‘నేను నెల రోజుల పాటు ఏం చేయాలా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు. ఈ వేడుకకు 50 మంది అతిధుల్లో 40 మంది తన పెళ్లికి హాజరయ్యారని చెప్పాడు. నేను సంతోషం కోసం పెళ్లి పై ఆధారపడను, జీవితంలో నేను ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుంటాను. పిల్లల్ని కంటాను, అంతమాత్రాన నా సంతోషం ఏమి పెళ్లి పై ఆధారపడి ఉండదని ’ వివరించాడు.