చావు కనబడింది..సెకన్ల గ్యాప్ లో : వైరల్ వీడియో

కాలిఫోర్నియాలోని రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి చావు అంచుల్లోకి వెళ్లొచ్చాడు. అదెలా అనుకుంటున్నారా.. వేగంగా వెళ్తున్న రైల్వే ట్రాక్ మీద పడి.. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు. ఇంతకు మధ్యలో ఏం జరిగుంటదో తెలుసుకోవాలని ఉందా..?
ఒక వ్యక్తి ప్లాట్ ఫాం నుండి రైల్వే ట్రాక్ పై పడిపోగానే.. అక్కడే ఉన్న ట్రాన్సిట్ వర్కర్ (మిస్టర్ కాన్నర్) ట్రాక్ పై పడిన వ్యక్తిని గుర్తించి.. వెంటనే ట్రైన్ దగ్గర్లోకి రాకముందే అతన్ని పట్టుకు ప్లాట్‌ఫాం మీదకు లాగి అతని ప్రాణాలను కాపాడాడు. ఇదంతా స్టేషన్ లో ఉన్న సీసీ కెమరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన తర్వత మిస్టర్ కాన్నర్ మాట్లాడుతూ.. అతను పడటం నేను చూశాను అసలు ఆలోచించే టైం కూడా లేదు.. వెంటనే అతన్ని పట్టుకుని బయటకు లాగాను.. వారు లేచి నిలబడి కౌగిలించుకున్నారు. ఓ మనిషి ప్రాణాన్ని నాకు తెలియకుండానే కాపాడాను.. దేవుడు నన్ను అతని కోసమే అక్కడకు రప్పించాడేమో అని తన సంతోషం వ్యక్తం చేశాడు.