Guinness World Records : ఒంటిపై మంటలతో 100 మీటర్లు పరుగెత్తిన ఫైర్ ఫైటర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు

ఒంటిపై మంటలు.. ఆక్సిజన్ ఉండదు.. 100 మీటర్లు పరుగు పెట్టాలి. సెకండ్ల వ్యవధిలో ఆ పని చేసి రికార్డు బద్దలు కొట్టాడు ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి. అయితే ఇలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు ఉన్నాయి? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Guinness World Records : ఒంటిపై మంటలతో 100 మీటర్లు పరుగెత్తిన ఫైర్ ఫైటర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు

Guinness World Records

Guinness World Records : ఒంటిపై మంటలు.. ఆక్సిజన్ లేకుండా 100 మీటర్లు పరుగులు తీశాడు. ఫ్రాన్స్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం  జోనాథన్ వెరో ఒక ప్రొఫెషనల్ స్టంట్ మ్యాన్. చిన్నప్పటి నుంచి మంటలు అంటే ఇష్టమట. అగ్నితో ఆటలు ఆడాడట.  ఫైర్ ఫైటర్‌గా ఫైర్ షోలలో మంటలను ఆర్పడం, మంటలను మింగడం వంటివి చేస్తూ ప్రేక్షకుల్ని అలరించేవాడట. ఇవన్నీ అతను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికి సహకరించాయి.

Josephine Michaluk : 96 లీటర్లు రక్తాన్ని దానం చేసిన 80 ఏళ్ల బామ్మ .. మానవత్వాన్ని వరించిన గిన్నిస్‌ రికార్డు

ఆక్సిజన్ లేకుండా ఒంటిపై మంటలు మండుతుంటే అత్యంత వేగంగా 100 మీటర్లు 17 సెకండ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు జోనాథన్ వెరో. ఈ రికార్డ్‌కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘అలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు ఉన్నాయి’ అని ఒకరు.. ‘ఇది రికార్డు ఎలా అవుతుంది?’ అని మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రాణాలకు ప్రమాదకరమైన ఫీట్లు రికార్డులలోకి ఎలా తీసుకుంటున్నారని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు.