Flood water: ఎన్నడూ చూడని విచిత్రాన్ని చూసిన ప్రజలు

ఈ సమయంలో ఓ కుర్రాడు వేక్ బోర్డుపై వరద నీటి ఇలా ఆడుకున్నాడు. అతడిని ఆశ్చర్యంగా చూడడం స్థానికుల వంతు..

Flood water: ఎన్నడూ చూడని విచిత్రాన్ని చూసిన ప్రజలు

Man wakeboards through Berkshire flood water

Updated On : January 8, 2024 / 2:58 PM IST

భారీ వర్షాలు సంభవించి వరదలు వస్తే ప్రజలు ఎంతో బాధపడిపోతూ కూర్చుంటారు. ఓ యువకుడు మాత్రం ఆ వరద నీటిలో అంబరాన్నంటే ఆనందంతో సర్ఫింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇంగ్లాండ్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ, కుక్హామ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో వరదలు రావడంతో అధికారులు బెర్క్‌షైర్ కౌంటీలో 24 సార్లు వరద హెచ్చరికలు, 30 సార్లు అలర్ట్ ప్రకటించారు. దాదాపు 1,800 ఇళ్లు, ఇతర స్థలాలు వరదలో మునిగాయి.

ఈ సమయంలో ఓ కుర్రాడు వేక్ బోర్డుపై వరద నీటి ఇలా ఆడుకున్నాడు. అతడిని ఆశ్చర్యంగా చూడడం స్థానికుల వంతు అయింది. ఎవరినీ పట్టించుకోకుండా ఆ యువకుడు సముద్రం వడ్డున సర్ఫింగ్ చేస్తున్నట్లు ఆనందపడిపోతూ దూసుకువెళ్లాడు. ఎన్నడూ చూడని విచిత్రాన్ని చూశామని స్థానికులు అంటున్నారు. గతంలో ఓ సారి రష్యాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.

Also Read: బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన క్రికెటర్.. అభిమానిని కొట్టిన వీడియో వైరల్