Reduce Age : 45 ఏళ్ల వ్యక్తి 18 లాగ కనపడటానికి ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నాడు

పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.

Reduce Age : 45 ఏళ్ల వ్యక్తి 18 లాగ కనపడటానికి ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నాడు

Rs.16 crores to reduce age

Updated On : May 23, 2023 / 7:39 PM IST

Reduce Age – Viral News : అందానికి మెరుగులు దిద్దుకోవడానికి చాలామంది అనేక రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. కొన్ని వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి తన వయసు తగ్గినట్లు కనపడటం కోసం ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నాడు. మీరు విన్నది నిజం.

A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

దేన్నైనా తిరిగి తీసుకురావచ్చేమో కానీ.. గడిచిన టైంని.. పెరిగిన వయసుని తగ్గించగలమా? అయ్యే పని కాదు. వెనీస్, కాలిఫోర్నియాకు చెందిన 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ అనే మిలియనీర్ 18 ఏళ్ల వయసులా కనిపించాలని తాపత్రయపడ్డాడు. వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టవచ్చా? అంటే సాధ్యమని చూపిస్తున్నాడు.

వయసు పెరిగే కొద్ది చిన్నగా కనపడాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. అందుకోసం ఫిట్ నెస్ క్లాసులకు వెళ్తారు. ఎక్సర్ సైజ్‌లు చేస్తారు. ఇవన్నీ కాదని బ్రయాన్ జాన్సన్ ఖరీదైన వైద్య చికిత్సను ఎంచుకున్నాడు. అందుకోసం ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. 30 మందికి పైగా వైద్యుల నుంచి ప్రత్యేక చికిత్సను పొందుతున్నాడట. రీజెనరేటివ్ మెడిసిన్‌లో ఎంతో నైపుణ్యం ఉన్న 29 ఏళ్ల ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం జాన్సన్ అవయవాలకు వృద్ధాప్యపు ఛాయలు రాకుండా చికిత్స అందిస్తోంది.

lip filler surgery : ఏదో కార్టూన్ పాత్ర అనుకునేరు.. లిప్ ఫిల్లింగ్ సర్జరీ ఫెయిలై ఇలా భయంకరంగా..

కొన్ని చికిత్సలు వికటిస్తే ప్రాణాల మీదకు వస్తాయి. కానీ జాన్సన్ తన వయసు కనపడకూడదని ఈ చికిత్సకు తెగించి మరీ ఇన్ని కోట్లు ఖర్చుపెట్టడం నిజంగానే విచిత్రం. ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండే జాన్సన్ చికత్సకు భవష్యత్‌లో ఇంకా ఎన్నికోట్లు ఖర్చు పెడతాడో.. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో?