Ukraine: ఉక్రెయిన్లో మళ్లీ కలకలం.. ఒక గొయ్యిలో 440 మృతదేహాలు
ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒక మీడియా సంస్థ ప్రకటించింది. వందల కొద్ది బయటపడ్డ ఈ మృతదేహాల్లో చాలా మట్టుకు ఏమాత్రం గుర్తు పట్టలేనంతగా ఉన్నాయట

Mass Grave Of Over 440 Bodies Found In Ukraine Recaptured City
Ukraine: రష్యా సేనలు కొద్ది రోజుల క్రితం ఆక్రమించిన ఖార్కీవ్ నగరాన్ని ఎట్టకేలకు ఉక్రెయిన్ తిరిగి వశ పరుచుకుంది. రాజధాని కీవ్ తర్వాత అతిపెద్ద నగరమైన ఖార్కీవ్.. తిరిగి తమ ఆధీనంలోకి రావడంతో ఉక్రెయిన్ అమితానందంలో ఉంది. అయితే ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. ఖార్కీవ్ నగరంలోని ఇజియా ప్రాంతంలో శవాల దిబ్బలు కనిపించాయి. గోయ్యిలో వందల కొద్ది మృతదేహాలు చూసి ఉక్రెయిన్ మరొక్కసారి ఉలిక్కి పడింది. గతంలో బూచా, మరియాపోల్ ప్రాంతాల్లో ఇలాంటి సామూహిక ఖననాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఖార్కీవ్ ప్రాంతంలోని సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒక మీడియా సంస్థ ప్రకటించింది. వందల కొద్ది బయటపడ్డ ఈ మృతదేహాల్లో చాలా మట్టుకు ఏమాత్రం గుర్తు పట్టలేనంతగా ఉన్నాయట. కొందరిని బాగా హింసించి చంపినట్లు తెలుస్తోందని సీనియర్ దర్యాప్తు అధికారి మీడియాకు తెలిపారు.
కాగా, ఖార్కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ మధ్యే పర్యటించారు. అనంతరం ఈ శవాల దిబ్బల గురించి ఓ టెలివిజన్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘‘అప్పుడు బుచా, మరియాపోల్.. ఇప్పుడు ఇజియం. రష్యా ప్రతిచోట మరణ శాసనాన్ని రాస్తోంది. దీనికి ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Kerala: భారత్ జోడో యాత్రకు చందా ఇవ్వనందుకు కూరగాయల వ్యాపారిపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం