Japan Earthquake: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..! ఇంట్లో వస్తువులు ఎలా ఊగిపోయాయో చూడండి.. వణుకు పుట్టించే వీడియో..
భారీ భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
Japan Earthquake: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం వచ్చింది. సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భారీ భూకంపం కారణంగా ప్రమాదకరమైన సునామీ తరంగాలు జపాన్, రష్యా తీరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా విధ్వంసకర అలలు వచ్చే ప్రమాదం ఉందంది. హొక్కైడోకు చెందిన ఒక వ్యక్తి ఈ భారీ భూకంపం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భూకంపం వచ్చిన కాసేపటికే హొక్కైడోలోని ఉరకావా, అమోరిలోని ముత్సు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
కాగా, ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీంతో ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. మార్చి 2011లో ఇదే ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ సంభవించి వేలాది మంది మరణించారు.
⚡️BREAKING
Japan: The moment the A 7.6 quake hit Hachinohe, shaking buildings and triggering tsunami warnings up to 3 meters.
The Aomori Asahi Broadcasting footage from Hachinohe shows the raw force of nature hitting late Monday night.pic.twitter.com/yWbApaQXsP— War Updates FC (@k_c_shivansh) December 8, 2025
M7.6 earthquake in Hachinohe City captured by Aomori Asahi Broadcasting.
Japan’s disaster preparedness saves lives, but the sheer force of this quake is shocking.
May every family find protection and every soul find courage. 🇯🇵🙏#Japan #earthquake #Tsunami pic.twitter.com/vmHIVCrflj
— Sumit (@SumitHansd) December 8, 2025
