Injured Whale: రక్తపు మరకలతో తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. అలలే తిరిగి రక్షించాలంటున్న అధికారులు

ఫ్రాన్స్ తీరంలో 25 అడుగుల భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఒళ్లంతా గాయాలు, రక్తపు మరకలతో పడి ఉంది. దీన్ని రక్షించేందుకు అధికారులు అంతగా ప్రయత్నించడం లేదు. అలలు వస్తే వాటితోపాటే తిరిగి సముద్రంలోకి వెళ్తుందని భావిస్తున్నారు.

Injured Whale: ఉత్తర ఫ్రాన్స్‌ తీరంలోకి ఒక భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. సోమవారం ఉదయం తిమింగలం ఒంటరిగా ఒడ్డున పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Kerala Muslim Women: ఇరాన్ మహిళలకు సంఘీభావం.. హిజాబ్ దహనం చేసిన కేరళ మహిళలు

ఇది పొడవైన ముక్కు కలిగిన ఆడ తిమింగలం. దీని పొడవు దాదాపు 7.6 మీటర్లు (25 అడుగులు) ఉంది. అలలధాటికి ఈ తిమింగలం ఒడ్డుకు కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ తిమింగలం గాయపడి, రక్తపు మరకలతో ఉంది. ఈ గాయాలు ఎలా అయ్యాయో తెలియవని, అయితే ఈ గాయాలు మరీ ప్రాణాంతకమైనవి కావని అధికారులు అంటున్నారు. ఇలా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు రావడం అరుదుగా జరుగుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తిమింగలాన్ని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగని తిమింగలాన్ని తిరిగి సముద్రంలో వదిలిపెట్టడం అంత తేలిక కాదని.. తాము ఆ పని చేయలేమని వారు అంటున్నారు.

Kerala: పెంపుడు కుక్కకు తిండి పెట్టడంలేదని బంధువు హత్య.. నిందితుడు అరెస్టు

భారీ కాయం ఉన్న ఈ తిమింగలాన్ని సముద్రంలోకి చేర్చలేమని, మళ్లీ అలలు వస్తే వాటితోపాటు తిమింగలం సముద్రంలోకి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. అలలు రాకపోతే ఈ తిమింగలం మనుగడ కష్టమవుతుంది. ఒకవేళ తిమింగలం మరణిస్తే, పోస్టుమార్టమ్ నిర్వహించి… ఇది గాయపడటానికి గల కారణాలు తెలుసుకుంటామని అధికారులు ప్రకటించారు. అలలు తిరిగి ముందుకు చొచ్చుకొస్తేనే తిమింగలం బతికే అవకాశాలున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు