Afghan : విమానంలో డెలివరీ, బిడ్డకు విమానం పేరు పెట్టుకున్న తల్లిదండ్రులు

నొప్పులు అధికంగా రావడంతో..విమానంలో డెలివరీ అయ్యింది. దీంతో తమను ఆదుకోవడమే కాకుండా..తమ బిడ్డ ప్రాణాలు నిలిపిన సిబ్బంది పట్ల వారు కృతజ్ఞత చాటుకున్నారు.

Afghan : విమానంలో డెలివరీ, బిడ్డకు విమానం పేరు పెట్టుకున్న తల్లిదండ్రులు

Us Army

Updated On : August 27, 2021 / 8:21 AM IST

Afghan Mother And Family : అప్ఘానిస్తాన్ లో ఎలాంటి సంక్షోభం నెలకొందో అందరికీ తెలిసిందే. తాలిబన్లు అప్ఘాన్ ను వశం చేసుకోవడంతో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో..దేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోతోంది. కట్టుబట్టలతో, పిల్లలతో తల్లిదండ్రులు విమానం ఎక్కేందుకు పోటీ పడుతున్నారు.

Read More : Bigg boss 5: క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్‌.. ఇద్దరికి కోవిడ్ పాజిటివ్?

అలాగే ఓ నిండు చూలాలు కూడా ప్రయత్నించింది. నొప్పులు అధికంగా రావడంతో..విమానంలో డెలివరీ అయ్యింది. దీంతో తమను ఆదుకోవడమే కాకుండా..తమ బిడ్డ ప్రాణాలు నిలిపిన సిబ్బంది పట్ల వారు కృతజ్ఞత చాటుకున్నారు. పుట్టిన బిడ్డకు విమానం పేరు పెట్టుకుని ఆనందభాష్పాలు రాల్చారు.  అప్ఘాన్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అప్పటికే ఆ మహిళ నిండు గర్భిణీ. వీరు యూఎస్ ఎయిర్ ఫోర్స్ సీ 17 విమానం ఎక్కారు. ఈ విమానం పేరు ‘రీచ్ 828’. జర్మనీలోని అమెరికాకు చెందిన రామ్ స్టెయిన్ బేస్ కు వెళుతున్న క్రమంలో…ఆమెకు నొప్పులు అధికమయ్యాయి.

Read More : Vijaya Diagnostic Centre: ఐపీఓకు రూ.1895కోట్లతో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్

విమానం అధిక ఎత్తులో ఎగురుతుండడంతో ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పైలట్ తక్కువ ఎత్తులో విమానాన్ని పోనిచ్చారు. బేస్ లో ల్యాండ్ అయిన తర్వాత..వైద్య సిబ్బంది ఆమెకు విమానంలోనే డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమను క్షేమంగా తీసుకరావడమే కాకుండా..డెలివరీ చేసిన సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటికప్పుడే వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు పుట్టిన బిడ్డకు విమానం పేరు పెడుతున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. రీచ్ 828 పేరు పెట్టాలని చిన్నారి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారని ఓ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని Air Mobility Command ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.